BJP slams ‘Adipurush’ director: ‘ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోండి’.. ‘ఆదిపురుష్’లో రావణుడిని చూపిన తీరుపై బీజేపీ విమర్శలు

బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్​​ ట్విటర్ లో స్పందిస్తూ... ఈ సినిమాను తీస్తున్న తీరు చాలా బాధ కలిగిస్తోందని చెప్పారు. వాల్మీకి రాసిన రామాయణంతో పాటు తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి ఆదిపురుష్ దర్శకుడు​ ఓం రౌత్ అధ్యయనం చేయలేదేమోనని విమర్శించారు. తెలుగు, తమిళంలో గతంలో రూపుదిద్దుకున్న సినిమాల్లోనైనా రావణుడి పాత్ర ఎలా ఉందనే విషయాన్ని ఓం రౌత్ పరిశీలిస్తే బాగుండేదని అన్నారు. ‘భూకైలాస’ సినిమాలో ఎన్టీఆర్​ లేదా రాజ్ కుమార్ లాంటి వారు, సంపూర్ణ రామాయణంలో ఎస్వీఆర్ వంటి వారు రావణుడి పాత్రలో ఎలా నటించారన్న విషయాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని సూచించారు.

BJP slams ‘Adipurush’ director: ‘ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోండి’.. ‘ఆదిపురుష్’లో రావణుడిని చూపిన తీరుపై బీజేపీ విమర్శలు

BJP slams ‘Adipurush’ director: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు, ట్రోలింగ్స్ ఎదుర్కొంటోంది. ఆ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో ఆదిపురుష్ ఎలా ఉండనుందన్న దానిపై కొద్దిగా స్పష్టత వచ్చింది. ఆ సినిమా తీస్తున్న తీరుపై బీజేపీ కూడా మండిపడింది. బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్​​ ట్విటర్ లో స్పందిస్తూ… ఈ సినిమాను తీస్తున్న తీరు చాలా బాధ కలిగిస్తోందని చెప్పారు.

వాల్మీకి రాసిన రామాయణంతో పాటు తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి ఆదిపురుష్ దర్శకుడు​ ఓం రౌత్ అధ్యయనం చేయలేదేమోనని విమర్శించారు. తెలుగు, తమిళంలో గతంలో రూపుదిద్దుకున్న సినిమాల్లోనైనా రావణుడి పాత్ర ఎలా ఉందనే విషయాన్ని ఓం రౌత్ పరిశీలిస్తే బాగుండేదని అన్నారు. ‘భూకైలాస’ సినిమాలో ఎన్టీఆర్​ లేదా రాజ్ కుమార్ లాంటి వారు, సంపూర్ణ రామాయణంలో ఎస్వీఆర్ వంటి వారు రావణుడి పాత్రలో ఎలా నటించారన్న విషయాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని సూచించారు.

ఆదిపురుష్ టీజర్​లో రావణుడి పాత్రలోని వ్యక్తి నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసుకున్నట్లు చూపించారని ఆమె చెప్పారు. చరిత్రను ఎవరూ తప్పుగా చూపించడానికి వీల్లేదని ఆమె అన్నారు. భారత దేశ ప్రజల నాగరికతను రామాయణం కాపాడుతుందని చెప్పారు. లంక వాసి, శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు 64 కళల్లో ప్రావీణ్యుడని ఆమె అన్నారు. అతడు వైకుంఠపాలకులయిన జయవిజయుల శాపానికి గురవుతాడని, దీంతో రావణుడిగా జన్మిస్తాడని చెప్పారు. ఔం రౌత్ తీస్తున్న రావణుడు మాత్రం టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడని చెప్పారు. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలని సూచించారు.

Rashid Khan: పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు అలా చేశారు..? క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్