Rashid Khan: పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు అలా చేశారు..? క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
దయచేసి చదువును చంపేయకండి.... ఏమీ తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టనబెట్టుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం ‘డోంట్ కిల్ ఎడ్యుకేషన్’ అంటూ ఆప్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

Afghan cricketer Rashid Khan
Rashid Khan: దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. అంటూ ఆప్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆప్గనిస్థాన్ లో జరుగుతున్న ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయంటూ రషీద్ పేర్కొన్నారు. ఆప్గనిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 53 మంది మరణించారు. మృతుల్లో అధికంగా విద్యార్థులే ఉన్నారు.
కాబూల్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చున్నాడు. కొద్దిసేపటికే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 53 మంది మరణించినట్లు, 110మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే ఇందులో మృతులు ఎక్కువగా విద్యార్థులే.
Kabul ?? ?????? #DontKillEducation ?? pic.twitter.com/mxmRFsswmc
— Rashid Khan (@rashidkhan_19) September 30, 2022
కాబూల్ ఘటనను ఉద్దేశించి ఆప్గనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. దయచేసి చదువును చంపేయకండి.. ఏమీ తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టనబెట్టుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం.. డోంట్ కిల్ ఎడ్యుకేషన్ అంటూ ఎమోషనల్ ట్వీట్ లో పేర్కొన్నారు.