North Korea Ballistic Missile: జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. సీరియస్‌గా రియాక్ట్ అయిన జపాన్

ఉత్తర జపాన్‌లోని కొంత‌భాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.

North Korea Ballistic Missile: జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. సీరియస్‌గా రియాక్ట్ అయిన జపాన్

North Korea Ballistic Missile

North Korea Ballistic Missile: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని మంగళవారం దక్షిణ కొరియా సైన్యం నిర్ధారించింది. ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ మిస్సైల్ ప్రయాణ సమయంలో హోక్వైడో ద్వీపంలోని ప్రజలంతా తమను తాము కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు.. కొన్ని రైళ్ల రాకపోకలనుసైతం తాత్కాలికంగా రద్దు చేసింది.

Elon Musk vs Jellon Ski Twitter War: క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమంటూ ఎలన్ మస్క్ ట్వీట్.. మండిపడ్డ జెలన్ స్కీ.. ఇరువురి మధ్య ట్విటర్ వార్..

ఉత్తర కొరియా తీరును జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని హింసాత్మక ప్రవర్తన గా ఆయన అభివర్ణించారు. ఉత్తర కొరియా తీరుపై జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ నుంచి 3వేల కిలోమీటర్ల దూరంలో ఈ మిసైల్ పడిందని, దీనివల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 7.29 గంటలకు ప్రజలంతా భవనాల లోపలికి కానీ, భూగర్భ షెల్టర్లలోకి కానీ వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం ఓ ప్రకటన చేసింది.. క్షిపణి ప్రయోగం ఉదయం 7.23 గంటలకు జరిగిందని, జపాన్ గగనతలం నుంచి అది దూసుకెళ్లిందని తెలిపింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2017 తర్వాత జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణిని పేల్చడం ఇదే తొలిసారి. గతవారం రోజుల్లో ఉత్తర కొరియా ఐద క్షిపణిలను ప్రయోగించింది. శనివారం రెండు క్షిపణిలు జపాన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ బయట జలాల్లో పడ్డాయి. ఉత్తర కొరియా బాలిస్టిక్, న్యూక్లియర్ ఆయుధ పరీక్షలు జరపకుండా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించింది. అయినా ఉత్తర కొరియా ఈ నిషేధాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.