కమలాపురం కలహం : వీరశివారెడ్డి వెనక్కి తగ్గుతారా

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల గొడవ కంటిన్యూ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు...ఇప్పటికే ఒకరికి కన్‌ఫాం చేశారు. అదే స్థానం టికెట్‌ కావాలని...ఓ మాజీ ఎమ్మెల్యే

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 03:59 PM IST
కమలాపురం కలహం : వీరశివారెడ్డి వెనక్కి తగ్గుతారా

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల గొడవ కంటిన్యూ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు…ఇప్పటికే ఒకరికి కన్‌ఫాం చేశారు. అదే స్థానం టికెట్‌ కావాలని…ఓ మాజీ ఎమ్మెల్యే

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల గొడవ కంటిన్యూ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు…ఇప్పటికే ఒకరికి కన్‌ఫాం చేశారు. అదే స్థానం టికెట్‌ కావాలని…ఓ మాజీ ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. జిల్లా టీడీపీ నేతలు…చంద్రబాబు న్యాయం చేస్తారని చెబుతున్నా సదరు నేత మాత్రం వినడం లేదు.

కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య టికెట్ల గొడవ తార స్థాయికి చేరింది. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి…2 సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. రాజంపేట-బత్యాల చెంగల్‌ రాయుడు, రాయచోటి-రమేష్‌ కుమార్ రెడ్డి, పీలేరు-నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి, పుంగనూరు-అనుషారెడ్డి, రైల్వేకోడూరు-నరసింహాప్రసాద్‌ని ఖరారు చేశారు. తంబళ్లపల్లె, మదనపల్లి సీట్లను మాత్రం పెండింగ్‌ పెట్టారు. అటు కమలాపురం అభ్యర్థిగా ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు.

కమలాపురం టికెట్‌పై సామాజిక సమీకరణలు, ఐవీఆర్ఎస్ సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగానే కమలాపురం  అభ్యర్థిగా ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని ప్రకటించిన సీఎం చంద్రబాబు….ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు. దీంతో పుత్తా నరసింహారెడ్డి ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. అయితే తనకే అసెంబ్లీ  టికెట్‌ ఇవ్వాలంటూ…మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పట్టుబడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వాదనపై ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి స్పందించారు. వీరశివారెడ్డికి న్యాయం చేయాలని… ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.  అందుకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారం మొదలు పెట్టానని తెలిపారు. టికెట్‌ కావాలంటున్న వీరశివారెడ్డికి సీఎం చంద్రబాబు ఎలా నచ్చ చెబుతారోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.