Ganesh Chaturthi 2023 : పసుపు గణపతిని ఎందుకు చేస్తారు? పూజ తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలి?

ఏ పూజ చేసినా ముందు గణపతిని పూజిస్తారు. పసుపుతో గణపతి ప్రతిమను తయారు చేస్తారు. అసలు పసుపు గణపతిని ఎందుకు పూజిస్తారు? పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలి?

Ganesh Chaturthi 2023 :  పసుపు గణపతిని ఎందుకు చేస్తారు? పూజ తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలి?

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023 : అనుకున్న పనులు పూర్తి కావాలని గణేశుని వేడుకుంటారు. పూజ, వ్రతం, శుభకార్యం ఏదైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వర పూజ చేస్తారు. అయితే పసుపుతో గణపతిని తయారు చేసి దానికి పూజలు చేస్తారు. అలా చేయడం వెనుక కథ ఉంది.

Ganesh Chaturthi 2023 : మొదటి పూజ గణపతికే ఎందుకు చేస్తారో తెలుసా?

ఏ పూజ తలపెట్టినా ముందుగా ఇంట్లో ఈశాన్యం దిశలో స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పీట వేసి పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి బియ్యంపిండితో ముగ్గులు వేయాలి. ఒక పళ్లెంలో బియ్యం తీసుకుని దానిపై తమలపాకును ఉంచి పసుపుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసి ఉంచాలి. ఇలా తయారు చేసిన గణపతికి అందరూ ముందుగా పూజలు చేస్తారు. ఇక కథ విషయానికి వస్తే పూర్వకాలంలో త్రిపురాసులు అనే రాక్షసులు బ్రహ్మవల్ల అనేక వరాలు పొంది ఆకాశంలో మూడు నగరాలు నిర్మించుకున్నారు. దేవతల్ని, లోకాలను ఇబ్బంది పెడుతూ పీడించసాగారు. ఈ రాక్షసుల బాధ తట్టుకోలేక దేవతలు శివుడి కోసం ప్రార్థనలు చేసారు. అప్పుడు శివుడు వీరికి ఒక ఉపాయం చెప్పాడు.

రాక్షసులు ఉన్న ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తుకోమని నందికి సూచించాడు. నంది ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను శివుడు సంహరించాడు. అయితే ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపు కొమ్ము.  కొమ్ము తెగిపోవడంతో నందికి చాలా విచారం కలిగింది.  గణపతి ఆ కొమ్మును వెతికి తెచ్చి ఇవ్వడంతో నంది సంతోషించింది. అప్పుడు శివుడు నంది పసుపు కొమ్ము పడిన చోట మొలిచిన పసుపు కొమ్ములను పొడి చేసి దానితో పసుపు గణపతిని చేసి ముందుగా దానిని పూజించాలని చెప్పాడట.  అలా పసుపు కొమ్ములతో పొడి చేసిన పసుపుతో పసుపు గణపతిని పూజించడం మొదలైందట.

Ganpati Special Trains :రైలు ప్రయాణికులకు శుభవార్త… 312 గణపతి ప్రత్యేక రైళ్లు

పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలని చాలామందిలో అనుమానం ఉంటుంది. పూజ పూర్తైన తరువాత తమలపాకును తూర్పు దిక్కుకు కదిలించి ఇంట్లోని దేవుడి మందిరంలో ఉంచాలి. మంచి రోజు చూసుకుని స్త్రీలు ఆ పసుపు గణపతిని ముఖానికి రాసుకోవాలి. లేదా మంగళ సూత్రాలకు రాసుకోవాలి. కాళ్లు, చేతులు, శరీరం, పాదాలకు ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదని పండితులు చెబుతుంటారు.