Lord Shiva Hindu Deity : హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవం ‘శివుడు’..

ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం.. హిందువులలో అత్యధిక సంఖ్యలో ఇష్టపడే దేవుడు శివుడు అని  పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా 22,975 మంది హిందువులను ఇంటర్వ్యూలు చేశారు.

Lord Shiva Hindu Deity : హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవం ‘శివుడు’..

Survey Lord Shiva Most Popular Hindu Deity

Lord Shiva Hindu Deity : అంతా ఈశ్వరుడే.. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు.. అందుకే హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవతల్లో ఇష్టమైన దేవుడిగా శివుడునే పూజిస్తుంటారు. హిందూ పాంథియోన్‌లో శివుడుని ‘ది డిస్ట్రాయర్’గా పిలుస్తుంటారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం.. హిందువులలో అత్యధిక సంఖ్యలో ఇష్టపడే దేవుడు శివుడు అని  పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా 22,975 మంది హిందువులను ఇంటర్వ్యూలు చేశారు. ఏ దేవుడు అంటే ఎక్కువగా ఇష్టమని అడిగారు. 15 దేవతల ఫొటోలను చూపించి చెప్పమన్నారు. మెజారిటీ హిందువుల్లో 84 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ దేవుళ్లను ఎన్నుకున్నారు. చాలా మంది హిందువులు తమ వ్యక్తిగత దేవుళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు. హిందువులు సాధారణంగా అత్యంత ఇష్టంగా భావించే దేవత శివుడు (44 శాతం) ఉన్నారు.

హిందువులలో మూడింట ఒకవంతు మంది హనుమంతుడు లేదా గణేశుడికి వరుసగా 35 శాతం, 32 శాతం ఆరాధ్య దేవతగా ఉన్నారు. సర్వేలో ఎంతమంది దేవతలనునైనా ఎంచుకోవచ్చుంటూ అవకాశం ఇచ్చారు. దాంతో హిందువుల్లో చాలామంది మొత్తం 100 శాతం కంటే ఎక్కువగానే తమ ఇష్టదేవతను ఎంచుకున్నారు. కేవలం 17 శాతం మంది హిందువులు మాత్రమే రాముడు తమ ఇష్టదైవమని చెప్పారు. అధిక సంఖ్యలో లక్ష్మి (28 శాతం), కృష్ణ (21 శాతం), కాశీ (20 శాతం) ఉన్నారు. హిందువులు తమ ఇష్టదైవంగా ఎంతమంది దేవతలను భావిస్తారనే దానిపై ప్రాంతీయంగా వైవిధ్యం ఉంది. వీరిలో 46 శాతం మంది వేర్వేరు దేవతలను తమ ఇష్టదైవాలుగా కలిగి ఉంటారని అంచనా.

భారత్ లోని పశ్చిమ రాష్ట్రాల్లో హిందువులు గణేశుడిని ఇష్టదైవంగా భావిస్తున్నారు. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో 15 శాతం మంది మాత్రమే ఇలా భావిస్తున్నారు. ఈశాన్యంలో 46 శాతం హిందువులు కృష్ణుడిని ఇష్టదైవంగా భావిస్తుండగా.. దక్షిణాదిలో కేవలం 14 శాతం మంది ఇదే చెబుతున్న వారు ఉన్నారు. రాముడు అంటే ఇష్టమనే భావాలు ముఖ్యంగా సెంట్రల్ రీజియన్‌లో 27 శాతం మంది ఉన్నారు. కానీ, ఇతర ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నారు.

ఈ సర్వేలో భాగంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లను కేంద్ర ప్రాంతంగా గుర్తించారు. హిందువులు ఎక్కువ మంది దేవతలను ఏకధర్మ రహిత మతంగా భావిస్తున్నారు. వారిలో చాలామంది దేవుడు ఒకడే అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. సర్వే ప్రకారం.. 61 శాతం హిందువులు ఒకే దేవుడు ఉన్నాడని నమ్ముతుండగా.. 7 శాతం మంది హిందువులు మాత్రమే వేర్వేరు దేవుళ్లను నమ్ముతున్నారని చెప్పారు.