Afghan spinner: అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన స్పిన్నర్

 అఫ్ఘానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ మెరుపులే మరో యువ కెరటం సత్తా చాటింది. ఇప్పుడు మరో స్పిన్నర్ మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జింబాబ్వే టూర్‌కి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ జట్టులో ఆడిన నూర్ అహ్మద్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.

Afghan spinner: అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన స్పిన్నర్

Noor Ahmad

Afghan Spinner:  అఫ్ఘానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ మెరుపులే మరో యువ కెరటం సత్తా చాటింది. ఇప్పుడు మరో స్పిన్నర్ మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జింబాబ్వే టూర్‌కి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ జట్టులో ఆడిన నూర్ అహ్మద్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. వన్డే సిరీస్‌లో విజయంతో పర్యటనను ప్రారంభించి టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను విజయంతో ముగించడానికి అఫ్ఘాన్ జట్టులో కీలకంగా నిలిచాడు.

హరారే వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్ నూర్ అహ్మద్ కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. అరంగేట్రంలోనే 10 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు అహ్మద్. అంతే ఈ గేమ్ కు హీరో అయిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ ఆతిథ్య జట్టుకు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నూర్ అహ్మద్ టాలెంట్ తో 90 పరుగులకే జింబాబ్వేను పడగొట్టారు.

ఈ ప్రదర్శనతో యువ ఫాస్ట్ బౌలర్ పేరిట వరల్డ్ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.

Read Also: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

నూర్ అహ్మద్ 17 ఏళ్ల 162 రోజుల వయసులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా స్వదేశీయుడైన రహ్మానుల్లా గుర్బాజ్ రికార్డును బద్దలు కొట్టాడు. గుర్బాజ్ 2019 సంవత్సరంలో 17 సంవత్సరాల 354 రోజుల వయస్సులో T20 ఇంటర్నేషనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఈ జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ అమీర్ 2010లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 2017లో పాకిస్థాన్‌కు చెందిన షాదాబ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. షాహీన్ షా ఆఫ్రిది ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.