Ind vs Aus : భారత మహిళా టీంకు మరో ఓటమి.. ఇకపై అన్నీ మ్యాచ్‌‌లు గెలవాల్సిందే

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పరాజయం పాలు కావడంతో.. మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సి...

Ind vs Aus : భారత మహిళా టీంకు మరో ఓటమి.. ఇకపై అన్నీ మ్యాచ్‌‌లు గెలవాల్సిందే

India

ICC Women’s World Cup : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పరాజయం పాలు కావడంతో.. మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సి ఉంటుంది. కప్ సాధించాలనే లక్ష్యంతో దిగిన మిథాలీ సేన రెండు మ్యాచ్ ల్లో నెగ్గితే… మరో రెండింటిలో ఓటమి పాలైంది. ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 2022, మార్చి 19వ తేదీ శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది భారత అమ్మాయిలు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా జట్టు 277 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ మహిళా క్రీడాకారిణులు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

Read More : ICC Women’s World Cup : భారత్ పరాజయం.. ఇంగ్లాండ్ గెలుపు

ఓపెనర్స్ నుంచి మొదలుకుని ఆడిన వారు చక్కగా రాణించారు. ప్రధానంగా మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ 97 (107 బంతులు 13 ఫోర్లు) చేశారు. ఓపెనర్ రేచల్ హేన్స్ వచ్చి రావడంతోనే భారత్ బౌలర్లపై విరుచుకపడ్డారు. మరో ఓపెనర్ అలిస్సా హేలీ కూడా అలాగే ఆడారు. హేన్స్ 43 రన్లు సాధించి అవుట్ అయ్యారు. అలాగే హేలీ 72 పరుగులు చేసి రానా బౌలింగ్ లో వెనుదిరిగారు. అనంతరం వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ బంతులను బౌండరీలకు తరలించారు. 107 బంతులను ఎదుర్కొన్న లానింగ్… 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయారు. ఇందులో 13 ఫోర్లు ఉండడం విశేషం. మధ్యలో ఎల్లీసి పెర్రి 28 కెప్టెన్ కు చక్కగా సహకరించారు. చివర్లో బెత్ మూనీ (30 నాటౌట్) ధాటిగా ఆడడంతో ఆసీస్ గెలుపొందింది. 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది.

Read More : ICC Women’s World Cup : ప్రపంచకప్‌‌లో బోణీ కొట్టిన భారత్.. పాక్ పరాజయం, చుక్కలు చూపించిన రాజేశ్వరి

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన భారత జట్టులో కెప్టెన్ మిథాలీ రాజ్ మెరిసారు. 96 బంతులతో 68 పరుగులు చేశారు. ఓపెనర్ మందాన (10), షఫాలీ (12) పేలవమైన ఆట తీరును కనబర్చారు. అనంతరం వచ్చిన యస్తిక భాటియా..మిథాలీలు స్కోరు పరుగులెత్తించారు. వీరిద్దరినీ విడగొట్టడానికి ఆసీస్ బౌలర్లు శ్రమించారు. 28 పరుగుల వద్ద రెండో వికెట్ పడగా… 158 స్కోర్ వద్ద… భాటియా (59) అవుట్ అయ్యారు. మిథాలీ రాజ్ (68), హర్మన్ ప్రీత్ కౌర్ (57) అర్థ సెంచరీలతో రాణించగా మిగతా వారు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఓటమితో భారత మహిళల టీం ప్రతొక్క మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. మరి మిథాలీ సేన ఏం చేస్తుందో చూడాలి.