IPL 2022: చెన్నైకి ఎదురుదెబ్బ.. రూ. 14కోట్ల ఆటగాడు అవుట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతుంది.

IPL 2022: చెన్నైకి ఎదురుదెబ్బ.. రూ. 14కోట్ల ఆటగాడు అవుట్!

Chahar

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో, మార్చి 14 లేదా 15 నుండి, అన్ని జట్లు తమ ప్రాక్టీస్ ప్రారంభిస్తాయి. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బౌలింగ్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ IPL 2022 మొదటి కొన్ని మ్యాచ్‌లలో పాల్గొనట్లేదు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన చాహర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం అవుతున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ IPL 2022 చివరి కొన్ని మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పూర్తి జట్టు:
కొనుగోలు చేసిన ఆటగాళ్లు – రాబిన్ ఉతప్ప (రూ. 2 కోట్లు), డ్వేన్ బ్రావో (రూ. 4.40 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), కెఎమ్ ఆసిఫ్ (20 లక్షలు), తుషార్ దేశ్ పాండే (20 లక్షలు), శివమ్ దూబే (4 కోట్లు), మహేశ్ దీక్షనా (70 లక్షలు), సిమర్జిత్ సింగ్ (20 లక్షలు), డెవాన్ కాన్వే (1 కోటి), డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), రాజ్వర్ధన్ హంగర్గేకర్ (1.50 కోట్లు), మిచెల్ సాంట్నర్ (1.90 కోట్లు), ఆడమ్ మిల్నే (1.90 కోట్లు), సుభ్రాంశు సేనాపతి (20 లక్షలు), ముఖేష్ చౌదరి (20 లక్షలు) మరియు ప్రశాంత్ సోలంకి (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), క్రిస్ జోర్డాన్ (3.60 కోట్లు), ఎన్ జగదీసన్ (20 లక్షలు) మరియు సి హరి నిశాంత్ (20 లక్షలు), రవీంద్ర జడేజా (16 కోట్లు), ఎంఎస్ ధోని (12 కోట్లు), మొయిన్ అలీ (8 కోట్లు) మరియు రీతురాజ్ గైక్వాడ్ (6 కోట్లు).

మార్చి 26న ప్రారంభమై మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి 10 జట్లతో కూడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబైలో మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. లీగ్ ఫైనల్ మే 29న జరిగే అవకాశం ఉండగా.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం మార్చి 26వ తేదీ శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.