రెండు అంగుళాలు.. రెండే పరుగులు.. ఒక ఒటమి.. వంద రికార్డు..

  • Published By: vamsi ,Published On : October 11, 2020 / 12:53 AM IST
రెండు అంగుళాలు.. రెండే పరుగులు.. ఒక ఒటమి.. వంద రికార్డు..

IPL 2020, KXIP vs KKR: ఐపీఎల్ 2020లో 24వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠబరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బలమైన స్థితిలో ఉండి కూడా చివరకు ఓడిపోయింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్‌లో దాదాపుగా ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు చేసుకుంది.



మ్యాచ్ 19 వ ఓవర్లో KKR ఫాస్ట్ బౌలర్ కృష్ణ మ్యాచ్‌ను మార్చేశాడు. అతను కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు ప్రభా సిమ్రాన్‌ను అవుట్ చేశాడు. ఇక్కడ నుంచి జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. జట్టు 2 అంగుళాల దూరంలో.. 2 పరుగుల తేడాతో కోల్‌కత్తాపై పంజాబ్ ఓడిపోయింది.



వాస్తవానికి, పంజాబ్ జట్టుకు చివరి బంతికి గెలవాలంటే 7 పరుగులు చేయవలసిన పరిస్థితి. సూపర్ ఓవర్‌కు మ్యాచ్ వెళ్లాలంటే 6 పరుగులు అవసరం. క్రీజులో గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నాడు.. బౌలర్ సునీల్ నరైన్. నరైన్ బంతిని ఆఫ్ స్టంప్ వైపుగా మాక్స్‌వెల్ బ్యాట్ మీదకు వచ్చిన బంతని సిక్సర్ కోసం కొట్టాడు.

అయితే బంతి బౌండరీకి సరిగ్గా ​​రెండు అంగుళాల ముందు పడిపోయింది. దీంతో పంజాబ్ ఓడిపోయింది. ఈ పరాజయంతో జట్టు 100వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పంజాబ్ 183మ్యాచ్‌లు ఆడగా.. అందులో 100మ్యాచ్‌లు ఓడిపోయింది. ఓడిన 100మ్యాచ్‌లలో ఒకటి సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన మ్యాచ్.



ఈ ఓటమితో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపిఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగా మారింది. వంద మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగా పంజాబ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు, టోర్నమెంట్లో అత్యధిక ఓటముల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ కలిగి ఉంది, కానీ ఇప్పుడు ఈ ఇబ్బందికరమైన రికార్డును కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరట ఉంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 100 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఓడిపోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 99 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఉంది, 95 ఓటములతో మూడవ స్థానంలో ఉంది ఆర్‌సిబి.



ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లను కోల్పోయిన జట్లు:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్-100
ఢిల్లీ క్యాపిటల్స్-99
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-95