Hardik Pandya: హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ తేదీ వెల్లడించిన కామెంటేటర్

ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ వన్డేలకు రిటైర్ పలకి హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ తర్వాత చాలామంది ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ తో అలసిపోయినట్లు ఫీలవుతున్నారట.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ తేదీ వెల్లడించిన కామెంటేటర్

Hardik Pandya

 

Hardik Pandya: ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ వన్డేలకు రిటైర్ పలకి హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ తర్వాత చాలామంది ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ తో అలసిపోయినట్లు ఫీలవుతున్నారట. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా మారడంతో.. రాబోయే రోజుల్లో మిగిలిన ప్లేయర్లు కూడా స్టోక్స్ బాట పట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా, ఇండియా కోచ్ రవి శాస్త్రి పెద్ద బాంబు పేల్చాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డేల నుంచి రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తాడని పేర్కొన్నాడు. అతని ఫోకస్ అంతా టీ20 క్రికెట్ పైనే ఉంచనున్నట్లు సూచించాడు.

ఒక్క పాండ్యా మాత్రమే కాదని, చాలా మంది క్రికెటర్లు ఫార్మాట్ ను ఎంచుకోనున్నారని వివరించాడు.

Read Also: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా

“టెస్టు క్రికెట్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ గానే ఉంటుంది. ఇప్పటికే ప్లేయర్లు వాళ్లు ఏ ఫార్మాట్ ఆడాలనుకుంటున్నారో ఎంచుకున్నారు. హర్దిక్ పాండ్యానే తీసుకుందాం. టీ20 క్రికెట్ ఆడటానికి ఇష్టపడతాడు. హార్దిక్ మిగతా ఏ ఫార్మాట్ ఆడటానికి రెడీగా లేడని చూస్తుంటేనే చెప్పగలం. మిగిలిన ప్లేయర్లు కూడా అదే చేస్తారు. వాళ్లకు ఫేవరేట్ అయిన ఫార్మాట్ నే ఎంచుకుంటారు” అని రవిశాస్త్రి వెల్లడించారు.