Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత టీ20 జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం పడటంతో 12ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 109పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేధించింది.

Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya

 

 

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత టీ20 జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం పడటంతో 12ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 109పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేధించింది. హార్దిక్ కెప్టెన్ గానే కాకుండా ఆల్ రౌండర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. ఒక వికెట్ పడగొట్టడంతో పాటు 12బంతులకు 24పరుగులు చేయగలిగాడు.

పురుషుల T20 క్రికెట్‌లో భారతదేశానికి నాయకత్వం వహించిన 8వ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచి బరోడా ఆల్-రౌండర్‌గా కొత్త రికార్డును సాధించాడు. షార్ట్ ఫార్మాట్‌లో వికెట్ తీసిన మొదటి టీమిండియా మెన్స్ కెప్టెన్ అయ్యాడు. మ్యాచ్ 2వ ఓవర్‌లో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ను అవుట్ చేయడంతో హార్దిక్ ఈ ఫీట్ సాధించాడు.

ఆదివారం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అంతా హార్దిక్‌కు అనుకూలంగానే మారిపోయింది. 2వ ఓవర్‌లో దాడికి దిగి స్టిర్లింగ్‌ను వెనక్కి పంపాడు. లాఫ్టెడ్ షాట్‌ను నేరుగా మిడ్-ఆఫ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతిలోకి పంపాడు.

Read Also: టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌కు చోటు

“సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం చాలా బాగుంది, అదృష్టవశాత్తూ గేమ్ గెలిచాం. జట్టు విజయంతో ప్రారంభించడం చాలా ముఖ్యం” అని భారత్ 1వ T20 గెలిచిన తర్వాత హార్దిక్ అన్నాడు.