సైన్యానికి సెల్యూట్ : ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి భారత్

పుల్వామా ఉగ్రదాడికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ ఘటన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నల్లని చేతి బ్యాండ్‌లతో బరిలోకి దిగింది. ఇప్పుడు మరోసారి...

  • Published By: vamsi ,Published On : March 8, 2019 / 08:29 AM IST
సైన్యానికి సెల్యూట్ : ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి భారత్

పుల్వామా ఉగ్రదాడికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ ఘటన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నల్లని చేతి బ్యాండ్‌లతో బరిలోకి దిగింది. ఇప్పుడు మరోసారి…

జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌కు మార్పులతో బరిలోకి దిగే టీమిండియా అనూహ్యంగా రెండో వన్డే పంథానే కొనసాగించింది. 2019 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకున్న కోహ్లీసేన తుదిజట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. 

ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి:
పుల్వామా ఉగ్రదాడికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ ఘటన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నల్లని చేతి బ్యాండ్‌లతో బరిలోకి దిగింది. ఇప్పుడు మరోసారి ఉదారతను చాటుకుంటూ ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగింది. ఈ క్యాప్‌లను ఎంఎస్ ధోనీ ప్రతి ప్లేయర్‌కు స్వయంగా తన చేతులమీదుగా అందజేశాడు.  
Also Read : ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..

ఈ విషయాన్ని టాస్ గెలిచిన అనంతరం తెలియజేస్తూ.. ‘ఇదొక ప్రత్యేకమైన క్యాప్. ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల పట్ల మేము చూపిస్తున్న గౌరవంగా భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో వచ్చే ఫీజును జాతీయ భద్రతా దళాలకు విరాళమివ్వాలనుకుంటున్నాం. దేశంలోని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. మనవాళ్లకు విరాళాలు ఇచ్చి మనమంతా ఒకే కుటుంబమని చాటి చెప్దాం. కచ్చితంగా ఇదొక ప్రత్యేకమైన గేమ్‌గా నిలిచిపోతుంది. వరుసగా రెండు గేమ్ లలోనూ విజయం సాధించడం గర్వంగా అనిపిస్తోంది. ఈ వన్డే సిరీస్ లోనే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్నాం. మాలోని నైపుణ్యాలను ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉంది.  
Also Read : సీనియర్‌ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం