ముత్తయ్య మురళీధరన్, కుంబ్లేల అరుదైన రికార్డ్ బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

ముత్తయ్య మురళీధరన్, కుంబ్లేల అరుదైన రికార్డ్ బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

RAVICHANDRAN-ASHWIN

RAVICHANDRAN ASHWIN: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ రికార్డు బ్రేక్ చేశాడు. మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మార్నింగ్ సెషన్ లో ఈ ఘనత నమోదు చేశాడు. ఎమ్సీజీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన ఘనత సాధించాడు.

ఆస్ట్రేలియా జోష్ హాజిల్ వుడ్ ను అవుట్ చేసి 192 మంది లెఫ్ట్ హ్యాండర్స్‌ను అవుట్ చేసిన రికార్డు నమోదు చేయగలిగాడు. ఈ అరుదైన రికార్డును ముందుగా శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ పేరు మీదుగా 191 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. మురళీధరన్, అశ్విన్ కాకుండా ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ కూడా 186వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక తర్వాత ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్ గ్రాత్ 172, షేన్ వార్న్ 172తో ఉండగా.. ఈ జాబితాలో ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

మంగళవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 6వికెట్లు నష్టపోయి 133పరుగులు చేయగలిగింది. బుమ్రా పాట్ కమిన్స్ ను 32పరుగులకు అవుట్ చేసి కామెరూన్ గ్రీన్ తో ఉన్న 57పరుగుల పార్టనర్ షిప్ ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ 45పరుగులు చేసిన గ్రీన్ ను అవుట్ చేశాడు. కాస్త వ్యవధిలోనే నాథన్ లయన్, హాజిల్ వుడ్ ను పెవిలియన్ పంపారు ఇండియన్ బౌలర్లు.

ఇలా పర్యాటక జట్టు చేతిలో 8వికెట్ల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. అంతేకాకుండా గత పదేళ్లలో బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా రెండోసారి విజయం సాధించింది.