India vs Sri Lanka : టీమిండియా మరో పోరు.. కోహ్లీ 100వ టెస్టు

పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4...

India vs Sri Lanka : టీమిండియా మరో పోరు.. కోహ్లీ 100వ టెస్టు

Kohli

Kohli 100 Test : టీ20 క్లీన్‌స్వీప్‌తో జోరుమీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తోంది. మొహాలీ వేదికగా తొలిపోరు ప్రారంభం కానుంది. టెస్టుల్లో రోహిత్ సారథ్యంలో భారత్ తొలిసారి బరిలోకి దిగబోతుంది. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. తన కెరీర్ లో 100వ టెస్టు ఆడబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టుల ఫీట్ సాధించిన 71వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.

Read More : Virat Kohli: కోహ్లీ వందో టెస్టు.. విషెస్ తెలిపిన క్రికెట్ లెజెండ్స్

ఈ అరుదైన ఫీట్‌పై స్పందించిన కోహ్లీ.. అసలు 100 టెస్టులు ఆడతానని తానెప్పుడూ అనుకోలేదని అన్నాడు. దేవుడి దయ, ఫిట్ నెస్ కోసం తాను పడిన కష్టం.. ఇలా అనేక అంశాలు వందో టెస్టు వరకూ తెచ్చాయని చెప్పాడు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ.. 2014లో ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్నాడు. అంతేకాకుండా టెస్టు కెప్టెన్లలో ఎక్కువ విజయాలు అందుకున్న నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించి.. సిరీస్‌లు గెలిచి కెప్టెన్‌గా.. ఆటగాడిగా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. మరోవైపు వందో టెస్టులో కోహ్లీ సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read More : Ind vs SL: కోహ్లీ 100వ టెస్టు కోసం.. స్టేడియాల్లోకి అభిమానులు

ఇటీవలే పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4న జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లెజెండ్లు తాము సైతం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ ద్వారా అభినందనలు తెలియజేశారు. విరాట్ కోహ్లీ సీనియర్ మెన్స్ క్రికెట్ లో 99టెస్టు మ్యాచ్ లు ఆడి 7వేల 962 పరుగులు చేశాడు. కెప్టెన్ గా ఆడిన 68 టెస్టుల్లో 40గెలిచాడు.