IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ కప్ బ్యాట్స్‌మన్ దినేశ్‌ కార్తిక్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు వారించారు.

IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట

Dinesh Karthik

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ కప్ బ్యాట్స్‌మన్ దినేశ్‌ కార్తిక్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు వారించారు.

‘‘మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ దినేశ్‌ కార్తిక్‌ను మందలించాం. కార్తిక్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియావళిలోని ఆర్టికల్‌​ 2.3ని (లెవల్‌-1)ఉల్లంఘించాడు. ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీదే తుది నిర్ణయం’’ అని పేర్కొన్నారు.

కార్తీక్ చేసిన తప్పును స్పష్టంగా వివరించలేదు. లెవల్‌ నిబంధన-1 ఉల్లంఘించినందున వార్నింగ్‌తో సరిపెట్టామని అన్నారు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్.. 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: దినేశ్ కార్తీక్‌కు వొంగి సెల్యూట్ చేసిన విరాట్ కోహ్లీ

ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతిని తప్పుగా అంచనా వేసిన డీకే కేవలం ఒక పరుగు మాత్రమే తీయగలిగాడు. దాంతో కోపంతో గట్టిగా అరిచినట్లు వీడియోల్లో కనిపించింది.

ఈ నేపథ్యంలోనే అతడిని మందలించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి గెలిచిన ఆర్సీబీ క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది.

ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన డీకే ఫినిషర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.