IPL 2022: “నా అరంగేట్ర మ్యాచ్ చూడటానికి బెటాలియన్ అంతా ప్లాన్ చేసింది”

తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయీస్ బ్యాట్ తో అదరగొట్టేశారు. స్పిన్నర్ కుమార్ కార్తీకేయం సింగ్ కూడా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. గ్రూప్ దశ మ్యాచ్ లలో భాగంగా సెకండాఫ్ లో..

IPL 2022: “నా అరంగేట్ర మ్యాచ్ చూడటానికి బెటాలియన్ అంతా ప్లాన్ చేసింది”

Mumbai Indians

IPL 2022: ముంబై ఇండియన్స్ టోర్నీలో ఎప్పుడూ లేనంతగా నిరాశపరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై.. 11మ్యాచ్ లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొందింది. ప్లేఆఫ్ కు ఆశలు వదులుకున్న ముంబై ఇండియన్స్.. యంగ్ ప్లేయర్లు ఆడేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ క్రమంలోనే తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయీస్ బ్యాట్ తో అదరగొట్టేశారు. స్పిన్నర్ కుమార్ కార్తీకేయం సింగ్ కూడా చక్కటి ప్రదర్శన కనబరిచాడు.

గ్రూప్ దశ మ్యాచ్ లలో భాగంగా సెకండాఫ్ లో ఎంటర్ అయ్యాడు ఈ కుమార్. రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తీకేయ అరంగ్రేట మ్యాచ్ లోనే 1/19తో అద్భుతమైన గణాంకాలను నమోదుచేశాడు. రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసనన్ వికెట్ కూడా తీసి ముంబై ఇండియన్స్ సీజన్ మొదటి విజయంలో కీలకమయ్యాడు.

Read Also: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్

పోలీసాఫీసర్ కొడుకైన కార్తీకేయ.. తన తండ్రికి తాను మైదానంలో మొదటిరోజు గేమ్ ఆడబోతున్నానని చెప్పడంతో మ్యాచ్ మొత్తం చూశారంటూ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

““నేను ఆడుతున్నానని మా నాన్నకు చెప్పా. ఆయన మొత్తం బెటాలియన్‌కు ఈ విషయాన్ని ప్రకటించడంతో. ప్రొజెక్టర్‌ను అమర్చి.. ప్రొజెక్టర్‌లో మ్యాచ్ మొత్తం చూశారు. నా మొదటి వికెట్ తీసుకున్నప్పుడు, అందరూ నిలబడి మా నాన్న చూస్తుండగా చప్పట్లు కొట్టి కౌగిలించుకున్నారట. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ వీడియోను నాకు పంపినప్పుడు అసమానమైన అనుభూతి కలిగింది. ” అని ముంబై ఇండియన్స్ ప్లేయర్ కార్తికేయ గుర్తు చేసుకున్నాడు.

తొలి రోజు ఆటలో కార్తికేయ తన మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ముందు MI కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాడు.

“నేను గ్రౌండ్‌లో బౌలింగ్ వేయాలనుకున్నప్పుడు రోహిత్ భయ్యా నాకు బంతిని ఇచ్చాడు. తడబడకుండా బౌలింగ్ చేయాలని, మిగతాదంతా తానే చూసుకుంటానని చెప్పాడు. నా బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని చెప్పి తర్వాత కాంప్లిమెంట్ ఇచ్చాడు. నిర్భయంగా బౌలింగ్ చేశానని కోచ్‌లందరూ కూడా చెప్పారు’ అని కార్తికేయ వివరించాడు.