IND vs SA: రబాడ బౌలింగ్‌లో బుమ్రా సిక్స్.. సంజనా సూపర్ రియాక్షన్

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ రెండో రోజు బుమ్రా సిక్సు హైలెట్ అయింది. సఫారీ ఫేసర్ రబాడ బౌలింగ్ లో సిక్సు బాదేశాడు.

IND vs SA: రబాడ బౌలింగ్‌లో బుమ్రా సిక్స్.. సంజనా సూపర్ రియాక్షన్

Bumrah

IND vs SA: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ రెండో రోజు బుమ్రా సిక్సు హైలెట్ అయింది. సఫారీ ఫేసర్ రబాడ బౌలింగ్ లో సిక్సు బాదేశాడు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ బాధ్యతలు అందుకుని జట్టును నడిపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 202పరుగులు మాత్రమే చేసింది టీమిండియా.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో 62వ ఓవర్ ఆడుతున్న బుమ్రా.. కగిసో రబాడ బౌలింగ్ ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఓవర్ లో మూడో బంతిని షార్ట్ బాల్ గా విసిరాడు రబాడ. ఆల్రెడీ షాట్ ఆడేందుకు ఫిక్స్ అయిపోయిన బుమ్రా.. సిక్స్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్న వాళ్లతో పాటు, చూస్తున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

అతని భార్య సంజనా గణేశన్ తనతో పాటు మ్యాచ్ చూస్తున్న మరికొందరితో షేర్ చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఈ సీన్ అంతా కెమెరాలో్ రికార్డ్ అయింది.

ఇది కూడా చదవండి: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్

భారత్ 63.1 ఓవర్లోలో 202 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జెన్సన్ 4 వికెట్లు తీసి భారత్‌ని భారీ స్కోరు చెయ్యకుండా కట్టడి చెయ్యగలిగాడు. వెన్ను నొప్పితో ఈ మ్యాచ్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండగా.. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 133 బంతుల్లో హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇన్నింగ్స్‌ చివర్లో అశ్విన్(46), జస్‌ప్రీత్ బుమ్రా (14) స్కోరు 200పరుగులు చెయ్యడంలో సాయం చేశారు.

36 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడగా.. వెంటనే క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు అవుటయ్యాడు. పుజారా 3 పరుగులకే అవుట్ అయ్యాక.. రహానె డకౌట్‌‌గా పెవిలియన్ చేరాడు. భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 46 పరుగులు నమోదు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జెన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు తీశారు.