Asia Cup: మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన కోహ్లి.. ఈ సెంచరీకి మరో విశేషం కూడా ఉంది. అదేంటో తెల్సా?

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసియా కప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం

Asia Cup: మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన కోహ్లి.. ఈ సెంచరీకి మరో విశేషం కూడా ఉంది. అదేంటో తెల్సా?

Kohli smashes an international hundred after 3 years

Asia Cup: 1,019 రోజులు లేదంటే అటు ఇటుగా మూడేళ్లు.. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి తీసుకున్న సమయమిది. ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-4 నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగిపోయి భారత్‭కు అత్యధిక స్కోర్‭ను అందించాడు. 53 బంతుల్లోనే సెంచరీ కొట్టిన కోహ్లీ.. మొత్తంగా 61 బంతుల్లో 12 ఫోర్లు, డజను సిక్సర్లతో అజేయంగా 122 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసియా కప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. కేఎల్ రాహుల్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ తొలి నుంచే పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇద్దరూ కలిసి యథేచ్ఛగా షాట్లు కొడుతూ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను ఆడేసుకున్నారు.

చివరి ఐదు ఓవర్లలో ప్రతి బంతిని బౌండరీ బాదేందుకే ప్రయత్నించిన కోహ్లీ.. జట్టుకు భారీ స్కోరు అందించాడు. తను ఎదుర్కొన్న తొలి 40 బంతుల్లో 59 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కేవలం 21 బంతుల్లో 72 పరుగలు చేశాడు. అతనికి రిషభ్ పంత్ (20 నాటౌట్) సహకరించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకోగా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు.

ఇక ఎప్పటి నుంచో తీవ్ర నిరాశలో ఉన్న కోహ్లీ అభిమానులు ప్రస్తుత సెంచరీతో పండగ చేసుకుంటున్నారు. నెట్టింట్లో పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని ఆకాశానికి ఎత్తుతున్నారు. నెట్టింట అభిమానులు చేస్తున్న కోలాహాలంలో కొన్ని ట్వీట్లు..