పంజాబ్‌పై ముంబై విజయం

  • Published By: vamsi ,Published On : October 1, 2020 / 11:59 PM IST
పంజాబ్‌పై ముంబై విజయం

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం(అక్టోబర్ 1) జరగిన 13వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ షేక్ జాయెద్ స్టేడియంలో జరగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించారు. తరువాత కీరోన్ పొలార్డ్, పాండ్యా తుఫాను ఇన్నింగ్స్‌‌తో ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొదట టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ రోహిత్ 70 పరుగులు చేశాడు. రోహిత్ తన 45 బంతుల ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున, షెల్డన్ కాట్రెల్, మహ్మద్ షమీ, కృష్ణప్ప గౌతమ్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.



టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముంబై జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ రోహిత్ 70 పరుగులు చేశాడు. రోహిత్ తన 45 బంతుల్లో ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్ మరియు జేమ్స్ ప్యాటిన్సన్ బౌలింగ్ ముందు, పంజాబ్ జట్టు మొదటి నుంచే తడబడింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై నిర్దేశించిన 192 పరుగులు చేజ్ చేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. తొలి నాలుగు ఓవర్లలో 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను అధ్భుతంగా ప్రారంభించగా.. తర్వాత మయాంక్ అగర్వాల్‌ అవుట్ అయ్యాడు. కెప్టెన్ రాహుల్‌కు సపోర్ట్‌గా వచ్చిన కరుణ్ నాయర్, తరువాతి ఓవర్‌లోనే క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తరువాత నికోలస్ పూరన్ మరియు రాహుల్ ఇన్నింగ్స్ నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ తొమ్మిదవ ఓవర్ మొదటి బంతికే చాహర్ కెఎల్‌ రాహుల్‌ను అవుట్ చేశాడు. .



అక్కడి నుంచి పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్.. ఇన్నింగ్స్ నడిపించగా.. 14 వ ఓవర్లో జేమ్స్ ప్యాటిన్సన్ పూరన్‌ను పెవిలియన్‌కు పంపాడు. పురన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. పంజాబ్ అభిమానులు మాక్స్‌వెల్‌పై అంచనాలను కలిగి ఉన్నప్పటికీ ట్రెంట్ బోల్ట్‌కు చాహర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. పంజాబ్ టాప్ 5 బ్యాట్స్ మెన్ 15 ఓవర్లలో పెవిలియన్‌కు వెళ్లిపోయారు. మాక్స్‌వెల్‌ అవుట్ అవ్వడంతో, పంజాబ్ విజయంపై ఆశలు దాదాపుగా ముగిశాయి.



అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ముంబైను స్కోరు బోర్డ్ స్టార్ట్ చెయ్యకుండానే వికెట్ తీసుకున్నాడు కాట్రెల్. అయితే రోహిత్ రాణించడంతో పాటు.. పొలార్డ్ (20 బంతుల్లో 47 పరుగులు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 30 పరుగులు) బ్యాటింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు 191 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్లో పొలార్డ్ కె.కె. గౌతమ్ బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టగా.. చివరి ఐదు ఓవర్లలో ముంబై 89 పరుగులు చేసింది.