IPL 2021 : ఆ లోగో ఉంటే జెర్సీ వేసుకోనన్న మొయిన్ ఆలీ, ఎందుకో తెలుసా

ఆ లోగో ఉంటే..తాను జెర్సీని ధరించలేనని, వెంటనే దానిని తీసివేయాలని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ ఆలీ కోరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆ లోగోను తొలగించింది.

IPL 2021 : ఆ లోగో ఉంటే జెర్సీ వేసుకోనన్న మొయిన్ ఆలీ, ఎందుకో తెలుసా

Chennai Super Kings

Moeen Ali : ఆ లోగో ఉంటే..తాను జెర్సీని ధరించలేనని, వెంటనే దానిని తీసివేయాలని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ ఆలీ కోరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆ లోగోను తొలగించింది. ఇంతకు ఏ లోగో ఉంది ? ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు ? ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరపున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ ఆలీ ఆడుతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మొయిన్ ఆలీని రూ. 7 కోట్లు వెచ్చించి మొయిన్ ఆలీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మొయిన్ ఆలీ..తొలిసారి చెన్నైకి ఆడుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం..ఆటగాళ్లకు జెర్సీలు తయారు చేయించింది. ఆ జెర్సీపై అల్కహాల్ బ్రాండ్ లోగో ఉంది. మొయిన్ ఆలీ ముస్లిం అనే సంగతి తెలిసిందే. అల్కహాల్ తీసుకోవడం, వాటిని ప్రోత్సాహించడం ఇస్లాం మతాచారాలకు విరుద్ధం. జెర్సీపై ఎస్ఎన్‌జే 10000 బ్రాండ్ లోగో ఉంది. ఇది చెన్నైలో ఉన్న ఎస్ఎన్‌జే డిస్టిల‌రీస్‌కు చెందిన‌ది. ఈ లోగోను తొల‌గించాల‌ని మొయిన్ అలీ కోర‌గా అందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ అంగీక‌రించింది. మొయిల్ అలీ ఇంగ్లండ్ టీమ్‌కే కాదు ఏ దేశ‌వాళీ టీమ్‌కు ఆడినా కూడా ఆల్క‌హాల్ బ్రాండ్ జెర్సీలు ధ‌రించ‌డు.

మరోవైపు…ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. క్రికెట్ వర్గాల్లో టెన్షన్‌ నెలకొంది. పొట్టి క్రికెట్ సమరానికి ముందే కరోనా వ్యాప్తి బీసీసీఐ గుండెల్లో గుబులు రేపుతుంది. ముంబై వాంఖడే స్టేడియానికి చెందిన ఎనిమిది మంది సిబ్బందికి కరోనా రావడమే ఇందుకు కారణం. ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.