R Ashwin: మంజ్రేకర్‌పై అపరిచితుడు డైలాగ్‌తో అశ్విన్ సెటైర్

సంజయ్ మంజ్రేకర్ కాంట్రవర్సీ కామెంట్లకేం కొత్త కాదు. ఇటీవల ఆల్ టైం గ్రేట్ అంటూ.. రవిచంద్రన్ అశ్విన్ పై వచ్చిన కామెంట్లను ఖండిస్తూ మరో సారి రచ్ఛ లేపాడు. గతంలో రవీంద్ర జడేజాపై కామెంట్లు చేసిన మంజ్రేకర్..

R Ashwin: మంజ్రేకర్‌పై అపరిచితుడు డైలాగ్‌తో అశ్విన్ సెటైర్

Manjrekar

R Ashwin: సంజయ్ మంజ్రేకర్ కాంట్రవర్సీ కామెంట్లకేం కొత్త కాదు. ఇటీవల ఆల్ టైం గ్రేట్ అంటూ.. రవిచంద్రన్ అశ్విన్ పై వచ్చిన కామెంట్లను ఖండిస్తూ మరో సారి రచ్ఛ లేపాడు. గతంలో రవీంద్ర జడేజాపై కామెంట్లు చేసిన మంజ్రేకర్.. అశ్విన్ పై వచ్చిన కాంప్లిమెంట్లను విమర్శించాడు.

అశ్విన్ ఆల్ టైం గ్రేట్ కాదంటూ.. డాన్ బ్రాడ్‌మన్, సోబర్స్, గవాస్కర్, టెండూల్కర్, విరాట్ లాంటి ప్లేయర్లు ఆల్ టైం గ్రేట్స్ గా నా బుక్ లో రాసుకున్నా. గౌరవప్రదంగానే చెబుతున్నా అశ్విన్ ఆల్ టైం గ్రేట్ ఇప్పటికింకా కాలేదు’ అని ట్వీట్ చేశాడు. దానిపై ఈ ఆఫ్ స్పిన్నర్ సెటైరికల్ రిప్లై ఇచ్చాడు.

అప్‌డి సొల్లదా డా చారీ.. మనసెల్లం వలికిర్ధు (అలా అనకు చారీ.. నా మనెసంత బాధపడుతుంది) అనే డైలాగ్ తో ఉన్న మీమ్ పోస్టు చేసి ఐదు స్మైలీలు ఉంచాడు. తన కెరీర్ మొత్తంలో 409వికెట్లు పడగొట్టిన అశ్విన్ 78టెస్టుల్లో 24.69 యావరేజ్ తో దూసుకెళ్తున్నాడు. లాంగెస్ట్ ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ లోనే ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.