IPl 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?

IPl 2022 : ఐపీఎల్‌ 2022లో పుణే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPl 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?

Watch Gujarat Titans Storm Back After Lalit Yadav Gets Run Out By Abhinav Manohar

IPl 2022 : ఐపీఎల్‌ 2022లో పుణే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ఐదు ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రిషబ్ పంత్‌, లలిత్‌ యాదవ్‌ నిలకడగా ఆడటంతో జట్టు మళ్లీ పుంజుకుంది.

లలిత్‌ (25/22) రనౌట్‌ కావడంతో మళ్లీ ఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే, లలిత్ యాదవ్ రనౌట్‌ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ విజయ్‌ శంకర్‌ వేశాడు. అదే ఓవర్ నాల్గో బంతిని పంత్ లెగ్ సైడ్ వేశాడు. సింగిల్ తీసేందుకు క్రీజు దాటి ముందుకు వచ్చాడు. కానీ, బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లిపోయింది. అంతే.. అక్కడే ఆగిపోయిన లలిత్ యాదవ్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్లీ లలిత్ యాదవ్‌ వెనక్కి పరిగెత్తాడు.

అదే క్షణంలో బంతిని అందుకున్న మనోహర్‌.. వికెట్లకు విసిరాడు. అక్కడే ఉణ్న విజయ్‌ శంకర్‌ బంతిని అందుకుని లలిత్‌ యాదవ్‌ క్రీజులోకి ప్రవేశించేలోపే.. వికెట్లను గిరాటేశాడు. అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది.. బంతి అందుకునే క్రమంలో విజయ్‌ శంకర్‌ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నేశాడు. దాంతో ఒక బెయిల్‌ జారిపడింది. విజయ్‌ శంకర్‌ చేతిలో బంతి ఉండగానే వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది.

రిప్లేలో పరిశీలిస్తే.. విజయ్ శంకర్ పొరపాటున ముందే వికెట్లను తన్నేశాడు. లలిత్ యాదవ్ రనౌట్ అయ్యే సమయానికి బంతి అతడి చేతిలోనే ఉందని తేలింది. దాంతో అది ఔట్ అంటూ అంప్లైర్లు ప్రకటించారు. తాను ఔట్ కాలేదని భావించిన లలిత్ యాదవ్‌కు నిరాశ తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులతో పరాజయం పాలైంది. గుజరాత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also : IPL 2022: నేరుగా మహిళ తలమీదకు సిక్సు బాదేసిన ఆయుష్ బదోనీ