T20 World Cup 2022: వర్షం పడి రేపటి భారత్-జింబాబ్వే మ్యాచ్ రద్దయితే.. పరిస్థితి ఏంటీ?

నవంబరు 9 నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. రేపటి మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్తుంది. జింబాబ్వే చిన్న జట్టే కాబట్టి భారత్ తప్పకుండా గెలుస్తుందనే భావించవచ్చు. అయితే, రేపటి మ్యాచు జరగకుండా వాన అడ్డుపడితే పరిస్థితి ఏంటన్న సందిగ్ధత నెలకొంది. రేపటి మ్యాచు రద్దు అయితే టీమిండియా-జింబాబ్వేకు ఒక్కో పాయింటు వస్తాయి. దీంతో టీమిండియా మొత్తం పాయింట్లు 7కి చేరతాయి. అయినప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. కానీ, గ్రూప్ బీలో టాప్-1 స్థానాన్ని మాత్రం కోల్పోయే చాన్స్ ఉంది.

T20 World Cup 2022: వర్షం పడి రేపటి భారత్-జింబాబ్వే మ్యాచ్ రద్దయితే.. పరిస్థితి ఏంటీ?

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి ఒకదాంట్లో ఓడిపోయింది. గ్రూప్-బీలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయితే, నెట్ రన్ రేట్ మాత్రం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ కంటే తక్కువగా ఉంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ కూడా ఇప్పటివరకు చెరో నాలుగు మ్యాచులు ఆడాయి. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో, పాకిస్థాన్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో టీమిండియాకు ఇప్పటివరకు సెమీఫైనల్ లో స్థానం ఖరారు కాలేదు. రేపు జింబాబ్వేతో టీమిండియా చివరి టీ20 ఆడనుంది.

నవంబరు 9 నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. రేపటి మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్తుంది. జింబాబ్వే చిన్న జట్టే కాబట్టి భారత్ తప్పకుండా గెలుస్తుందనే భావించవచ్చు. అయితే, రేపటి మ్యాచు జరగకుండా వాన అడ్డుపడితే పరిస్థితి ఏంటన్న సందిగ్ధత నెలకొంది. రేపటి మ్యాచు రద్దు అయితే టీమిండియా-జింబాబ్వేకు ఒక్కో పాయింటు వస్తాయి. దీంతో టీమిండియా మొత్తం పాయింట్లు 7కి చేరతాయి.

అయినప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. కానీ, గ్రూప్ బీలో టాప్-1 స్థానాన్ని మాత్రం కోల్పోయే చాన్స్ ఉంది. ఎందుకంటే దక్షిణాఫ్రికాకు ప్రస్తుతం 5 పాయింట్లు ఉన్నాయి. తదుపరి మ్యాచు నెదర్లాండ్స్ తో ఆడనుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే మొత్తం 7 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో చేరతాయి. దక్షిణాఫ్రికా రన్ రేటు ఎక్కువగా ఉండడంతో ఆ జట్టు గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలుస్తుంది.

ఒకవేళ నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే సౌతాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లే ఉంటాయి. దీంతో ఇప్పటికే పాక్-బంగ్లాదేశ్ జట్లకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. రేపు ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లతో ఏ జట్టు గెలిచినా ఆ జట్టుకు 6 పాయింట్లు వస్తాయి. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే పాక్-బంగ్లాదేశ్ జట్లలో ఏదైనా ఒక జట్టు సెమీఫైనల్ చేరుతుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..