Brij Bhushan Sharan: ఆ ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకుంటా: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

బ్రిజ్ భూషణ్, కోచ్‌ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్‌తోపాటు 30 మంది స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు.

Brij Bhushan Sharan: ఆ ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకుంటా: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

Brij Bhushan Sharan: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తోపాటు కోచ్‌లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, ఇతర రెజ్లర్లు బుధవారం ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

ఈ ఆరోపణలు జరిగినట్లు రుజువైతే ఉరేసుకుంటానని చెప్పారు. బ్రిజ్ భూషణ్, కోచ్‌ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్‌తోపాటు 30 మంది స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్, కోచ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లు తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు, వాళ్ల వల్ల ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు వినేశ్ ఫోగట్ చెప్పింది. ఈ వేధింపుల వల్ల ఒక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నట్లు కూడా చెప్పింది.

Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

తమ బాధ గురించి ఎవరూ పట్టించుకోరని, ఈ వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినందుకు తనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతూ వినేశ్ ఫోగట్ తీవ్ర ఆవేదనకు గురైంది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కూడా బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేశారు. ఫెడరేషన్‌లో ఉండే వాళ్లకు ఆట గురించి తెలియదని, బ్రిజ్ భూషణ్‌ తమను కూడా వేధింపులకు గురి చేశాడని చెప్పాడు. తమ పోరాటం ప్రభుత్వంపైనో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపైనో కాదని, రెజ్లింగ్ ఫెడరేషన్‌పైనేని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేంత వరకు ఆందోళన విరమించబోమని, ఏ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోమని చెప్పారు.

C Kalyan: నాకు పదవీ వ్యామోహం లేదు.. ఫిబ్రవరి 19న ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికలు: సి.కల్యాణ్

అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టి పారేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘‘లైంగిక ఆరోపణలు చేయడం చాలా పెద్ద విషయం. నామీదే ఆరోపణలు చేసినప్పుడు నేనెలా చర్యలు తీసుకోగలను. ఈ అంశంపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. ఒకవేళ అలాంటి వేధింపులు జరిగినట్లు తేలితే ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధమే’’ అని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు. కాగా, 2011 నుంచి బ్రిజ్ భూషణ్‌ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.