Babar Azam: అలా చేసుంటే మేం గెలిచేవాళ్లం.. సఫారీ జట్టుపై ఓటమి తరువాత బాబర్ అజామ్

పాకిస్థాన్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజ‌యం సాధించింది. త‌ద్వారా పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది.

Babar Azam: అలా చేసుంటే మేం గెలిచేవాళ్లం.. సఫారీ జట్టుపై ఓటమి తరువాత బాబర్ అజామ్

Babar Azam

ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా అద‌ర‌గొడుతోంది. శుక్ర‌వారం చెన్నై వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది. మార్‌క్ర‌మ్ (91; 93 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్స‌ర్లు) రాణించ‌డంతో 271 ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా 47.2 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మిల్ల‌ర్ (29), బ‌వుమా (28), క్వింట‌న్ డికాక్ (24), డ‌స్సెన్ (21) లు త‌లా ఓ చేయి వేశారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో ష‌హీన్ అఫ్రీది మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ వసీం జూనియర్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి.

Read Also : ODI World Cup 2023 : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దేశం కోసం కాదు.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆడుతున్నారు

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ.. దురదృష్టం కూడా తమను వెంటాడిందని అన్నారు. ఈ ఓటమి మా జట్టులోని ప్రతీ ఒక్కరిని నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో మాకు గెలిచే అవకాశం దక్కింది. కానీ చివరి నిమిషంలో మాకు నిరాశ ఎదురైందని బాబర్ అన్నారు. ఈ మ్యాచ్ గెలిచిఉంటే సమీస్ ఆశలు కూడా సజీవంగా ఉండేవి. కానీ, ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సెమీస్ కు చేరే అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. చివరి మూడు మ్యాచ్ లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మూడు మ్యాచ్ ల తరువాత పాయింట్స్ టేబుల్ లో ఎక్కడ ఉంటామో చూద్దాం అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.

Read Also : Mohammad Rizwan : దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఘ‌న‌త‌

మేము ఇంకో 10 నుంచి 15 పరుగులు చేసినా గెలిచేవాళ్లం. మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. డీఆర్ఎస్ నిర్ణయం ప్రతీకూలంగా రావడంకూడా తమ విజయావకాశాలను దెబ్బతీసిందని బాబర్ అన్నారు. అయితే, మ్యాచ్ లో భాగంగా హ్యారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షంసీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో పాకిస్థాన్ ప్లేయర్స్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే బాబర్ రివ్యూ తీసుకోగా.. రిప్లైలో అంపైర్స్ కాల్ గా తేలింది. బాల్ ట్రాకింగ్ లో బంతి లెగ్ స్టప్ ను లైట్ ముద్దాడటంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చారు.