WTC Final: మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం నుంచి అభిమానులను గెంటేశారు

వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ సందర్భంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఫైనల్ టెస్టు మ్యాచ్ నుంచి ఇద్దరు అభిమానులను గెంటేశారు. ఐదో రోజు మ్యాచ్ లో స్టేడియంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తులో నినాదాలు చేస్తూ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేశారు.

WTC Final: మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం నుంచి అభిమానులను గెంటేశారు

Stadium

WTC Final: వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ సందర్భంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఫైనల్ టెస్టు మ్యాచ్ నుంచి ఇద్దరు అభిమానులను గెంటేశారు. ఐదో రోజు మ్యాచ్ లో స్టేడియంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తులో నినాదాలు చేస్తూ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేశారు. ఇందులో కాస్త అపశ్రుతి నమోదైంది. టీమిండియాను సపోర్ట్ చేస్తూ న్యూజిలాండ్ ప్లేయర్లను తిట్టిపోశారు.

ఈ విషయం కాస్తా స్టేడియం నిర్వహకుల దృష్టికి వెళ్లడంతో వాళ్లను అప్పుడే గెంటేశారు. ‘మా సెక్యూరిటీ టీమ్ ఆ దోషులను పట్టుకోగలిగింది. వారిని గ్రౌండ్ నుంచి పంపించేశాం. అటువంటి వైఖరి ప్రవర్తించే వారెవరినైనా సహించేది లేదు’ అని అధికారులు వెల్లడించారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత టిమ్ సౌథీని ఘటన గురించి అడిగారు.

‘ఇలా నేను వినడం తొలిసారి. ఫీల్డ్ లో ఎప్పుడూ మంచి స్పిరిట్ తోనే ఉండాలి’ అని అన్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో, ఐదవ రోజు న్యూజిలాండ్ జట్టు 249 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా కివీస్ జట్టుకు 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐదవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి 32 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఫైనల్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉండగా.. ఆరవ రోజు కూడా మ్యాచ్ జరుగుతోంది. ఆరవ రోజు మొత్తం ఆట జరుగుతుందా? జరిగినా ఫలితం తేలుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నే.