Home » agriculturetips
మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ, తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది .
2020 ఫిబ్రవరిలో 4 గేదెలతో డైరీని ప్రారంభించారు. నేడు ఈ డైరీ 18 గేదెలతో పాటుగా రెండు ఆవులతో కళ కళలాడుతోంది. రోజుకు 80 లీటర్ల వరకూ స్వచ్ఛమైన పాల దిగుబడి తీస్తూ... డోర్ డెలివరీ విధానంలో విక్రయిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.
ఎత్తుమళ్ళలో నారుపెంపక విధానం ఈ సమస్యలను కొంత వరకు అధిగమించినా, చీడపీడల ఉధృతి ఎక్కువగా వుండటంతో... ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది.
చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.
మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజూ అందించే అవకాశం వుండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్లతోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా వుండి, దిగుబడులు పెరుగుతున్నాయి.
కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో వేసిన కంది పూత, కాత దశలో ఉంది. అయితే ఈ దశ చాలా కీలకమైంది . ఈ సమయంలో కందికి ప్రధాన శత్రువులైన శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
రసాయన ఎరువులతో సాగు చేసే భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రసాయనాలకు బదులు వర్మీ కంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
దీంతో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని నిచ్చయించుకొని గత ఏడాది నుండి బోడ కాకరను ఎత్తుమడులపై మల్చింగ్ వేసి, స్టేకింగ్ విధానంలో అర ఎకరంలో సాగుచేస్తున్నారు రైతు జంగం భూమన్న. నాటిన రెండో నెల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది.