Making Vermicompost : చెత్తనుండి వర్మికంపోస్ట్ తయారీ

రసాయన ఎరువులతో సాగు చేసే భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రసాయనాలకు బదులు వర్మీ కంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

Making Vermicompost : చెత్తనుండి వర్మికంపోస్ట్ తయారీ

Vermi Compost Preparation

Updated On : September 27, 2023 / 10:45 AM IST

Making Vermicompost : ఇంటిలోని చెత్త.. కుళ్లిన కూరగాయలు.. పశువులపేడ కాదేదీ సంపదకు అనర్హమంటుంది ఓ పంచాయతీ. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చే ప్రక్రియను పక్కాగా అమలు చేయడంతోపాటు సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయాలు ప్రారంభించింది. చిన్న చిన్న అవసరాలకు ప్రభుత్వం వైపు చూడకుండా ఉన్న వనరులతో సంపద సృష్టించుకోవటం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఏలూరు జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడు గ్రామం.

READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !

రసాయన ఎరువులతో సాగు చేసే భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రసాయనాలకు బదులు వర్మీ కంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కూడా సేంద్రియ ఎరువు వాడకం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తోంది.

READ ALSO : Bank holidays : అక్టోబర్ నెలలో బ్యాంకులకు అధిక సెలవులు.. ఖాతాదారులకు అలర్ట్

ఇందుకు అనుగుణంగానే ఏలూరు జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడు గ్రామ పంచాయితీ గ్రామంలో కంపోస్ట్‌ షెడ్డు నిర్మించింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తుంది. . సేకరించిన వ్యర్థాలను వేరు చేసి , పశువుల పేడ, వానపాముల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. తయారైన వర్మీకంపోస్ట్ ను బస్తాల్లోకి నింపి రైతులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తూ పంచాయతీకి ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారు.