Bank holidays : అక్టోబర్ నెలలో బ్యాంకులకు అధిక సెలవులు.. ఖాతాదారులకు అలర్ట్

అక్టోబర్ నెలలో పండుగలు అధికంగా రావడంతో బ్యాంకులకు అధిక సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఆదివారాలు, నాల్గవ శనివారాల సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని జర్వ్ బ్యాంక్ తెలిపింది.

Bank holidays : అక్టోబర్ నెలలో బ్యాంకులకు అధిక సెలవులు.. ఖాతాదారులకు అలర్ట్

Bank holidays

Bank holidays : అక్టోబర్ నెలలో పండుగలు అధికంగా రావడంతో బ్యాంకులకు అధిక సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఆదివారాలు, నాల్గవ శనివారాల సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

Also Read: ఇక సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు…కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వెల్లడి

నెలలో కేవలం 14 రోజుల పాటే బ్యాంకులు పనిచేస్తాయని, బ్యాంకుల ఖాతాదారులు ఆర్థిక అవసరాలను బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. సెలవు రోజుల్లో బ్యాంకుల ఆన్‌లైన్ ఆర్థిక సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకుల సెలవు రోజుల్లో ఖాతాదారులు ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

Also Read : తెలంగాణకు ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్ ఖరారు
2023 అక్టోబర్ లో బ్యాంకులకు సెలవులు

అక్టోబర్ 1: ఆదివారం
అక్టోబర్ 2 (సోమవారం): గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)
అక్టోబర్ 8: ఆదివారం
అక్టోబర్ 14 (శనివారం): మహాలయ (పశ్చిమ బెంగాల్), రెండవ శనివారం

అక్టోబర్ 15: ఆదివారం
అక్టోబర్ 18 (బుధవారం): కటి బిహు (అస్సాం)
అక్టోబర్ 21 (శనివారం): దుర్గా పూజ (మహా సప్తమి) (అసోం, మణిపూర్, త్రిపుర, పశ్చిమ బెంగాల్)
అక్టోబర్ 22: ఆదివారం
అక్టోబర్ 23 (సోమవారం): దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/దుర్గాపూజ/విజయ దశమి (ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, కేరళ, నాగాలాండ్, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్)
అక్టోబర్ 24 (మంగళవారం): దసరా (విజయ దశమి)/దుర్గాపూజ (ఆంధ్రప్రదేశ్, మణిపూర్ మినహా అన్నిచోట్లా)

అక్టోబర్ 25 (బుధవారం): దుర్గా పూజ (సిక్కిం)
అక్టోబర్ 26 (గురువారం): దుర్గాపూజ ప్రవేశ దినం (సిక్కిం, జమ్మూ కాశ్మీర్)
అక్టోబర్ 27 (శుక్రవారం): దుర్గా పూజ (సిక్కిం)
అక్టోబర్ 28 (శనివారం): లక్ష్మీ పూజ (పశ్చిమ బెంగాల్); రెండవ శనివారం
అక్టోబర్ 29: ఆదివారం
అక్టోబర్ 31 (మంగళవారం): సర్దార్ పటేల్ జయంతి (గుజరాత్).