Drip Irrigation : డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజూ అందించే అవకాశం వుండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్లతోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా వుండి, దిగుబడులు పెరుగుతున్నాయి.

Drip Irrigation
Drip Irrigation : ఉద్యాన, వాణిజ్య పంటల్లో బిందు సేద్య విధానం రైతులకు అన్నివిధాలుగా చేయూతగా నిలుస్తోంది. నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం వుండటం, అవసరం మేరకే మొక్కలకు నీరందించటం ఈ విధానంలోని ప్రత్యేకత. దీనికి తోడు ఎరువులను డ్రిప్ ద్వారా అందించటం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడినిస్తున్నాయి. దీన్ని ఫెర్టిగేషన్ అంటారు. అయితే చాలామంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని, మన్నిక తగ్గిపోతోంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : Boda Kakarakaya Cultivation : బోడకాకరసాగుతో బోలెడు లాభాలు
మెట్ట పంటల సాగులో రైతులపాలిట కల్పతరువుగా మారింది డ్రిప్ సేద్య విధానం. నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు నీరు అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు. ఈ విధానంలో ప్రధానంగా 5 రకాల పద్ధతులు వున్నప్పటికీ ఉద్యాన పంటల్లో రైతులు ఎక్కువగా ఆన్ లైన్, ఇన్ లైన్ డ్రిప్ పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు.
READ ALSO : Ostrich people : నిప్పుకోడిలా కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండే వింత ప్రజలు ..
ఈ విధానంలో ముందుగా కావాల్సిన మోతాదులో నీటిని ఒక డ్రమ్ములో కలిపి, ఫర్టిలైజర్ టాంకు ద్వారా లేదా వెంచూరి పంప్ తో నేరుగా నీటితోపాటు ఎరువును, మొక్కలకు అందించటం జరుగుతుంది. నీటిలో కరిగే అన్నిరకాల ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో సమర్ధంగా ఉపయోగించవచ్చు. వీటిని సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు. నీటితోపాటు ఎరువు భూమిలో ఇంకిపోవటం వల్ల, వేరువ్యవస్థకు త్వరగా అందుతుంది. సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం రెండింతలు పెరుగుతుంది.
READ ALSO : Pest Prevention : వరిలో పెరిగిన చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజూ అందించే అవకాశం వుండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్లతోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా వుండి, దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే ఫర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవటం, డ్రిప్ ద్వారా అందించేటప్పుడు ప్రెషర్ గేజ్ లో సరైన ప్రెషర్ వుండేటట్లు చూసుకోకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తోంది. అందువల్ల తోటలకు ఫర్టిగేషన్ చేసేటప్పుడు రైతులు తగిన అవగాహనతో అందిస్తే ఇబ్బందులు వుండవని సూచిస్తున్నారు నల్గొండజిల్లా నకిరేకల్ ఉద్యాన అధికారి విద్యాసాగర్.
READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !
తోటలకు ఫర్టిగేషన్ చేసేటప్పుడు డ్రిప్ ద్వారా ముందు నీటిని అందించి, కొద్దిసేపటి తర్వాత ఎరువు నీటిని అందించాలి. దీనివల్ల తడిగా వున్న భూమినుంచి ఎరువునీరు, మొక్క వేరువ్యవస్థకు త్వరగా అందుతుంది. ఎరువు వృధాకాదు. ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను కలపకుండా వేరువేరుగా అందించాలి. డ్రిప్ లేటరల్స్ పనితీరును తరచూ గమనిస్తూ, నీటి విడుదలకు అవరోధం లేకుండా చూసుకుంటే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. డ్రిప్ ద్వారా 21 నుండి 50 శాతం వరకు నీరు ఆదా అవటమే కాక, సమర్థ ఎరువుల వినియోగం వల్ల ఖర్చు తగ్గుతుంది.