Ostrich people : నిప్పుకోడిలా కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండే వింత ప్రజలు ..

మనుషుల కాళ్లకు చేతుల్లాగానే ఐదు వేళ్లు ఉంటాయి. కొంతమందికి చేతులకు ఆరు వేళ్లు కూడా ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలోనివసించే మనుషుల కాళ్ల రెండే రెండు వేళ్లు ఉంటాయి. వారి కాళ్లు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

Ostrich people : నిప్పుకోడిలా కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండే వింత ప్రజలు ..

Zimbabwe Ostrich People

Updated On : September 28, 2023 / 5:26 PM IST

Zimbabwe Ostrich People : సాధారణంగా మనుషుల కాళ్లకు చేతుల్లాగానే ఐదు వేళ్లు ఉంటాయి. కొంతమందికి చేతులకు ఆరు వేళ్లు కూడా ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలోనివసించే మనుషుల కాళ్ల రెండే రెండు వేళ్లు ఉంటాయి. వారి కాళ్లు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ నివసించేవారందరికి అంతే కాళ్లకు రెండే వేళ్లు ఉంటాయి. అది జన్యుపరంగా వచ్చిన లోపమా..? ఏమో తెలీదుగానీ ఆఫ్రియాలోని ఓ తెగ మనుషుల కాళ్లకు రెండే వేళ్లుంటాయి.

జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో డొమా తెగలో ప్రజల కాళ్లకు రెండే వేళ్లు ఉంటాయి. ఈ తెగ ప్రజలను వడోమా తెగ అని..బంట్వానా అని కూడా పిలుస్తారు. ఈ తెగలో అందరికి అంతే. వారి కాళ్లు అచ్చంగా నిప్పు కోడి కాళ్లలా ఉంటాయి. బహుశా అందుకేనేమో వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా అంటారు. అరుదైన జన్యుపరమైన రుగ్మత వల్లే వారి కాళ్లకు రెండే వేళ్లు ఉంటాయని పరిశోధకులు చెబుతుంటారు. ఈ ఆరోగ్య సమస్యని ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు.

ChatGPT Made Beer : AI తయారు చేసిన బీర్ .. 150వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ వినూత్న యత్నం

వీరికి ఉన్న ఈ సమస్య వల్ల ఈ తెగకు చెందిన వారికి వివాహాలు జరగటం కూడా కష్టమైపోతోంది. వారికి ఇతర తెగల నుంచి పిల్లను ఇవ్వటానికి గాని పిల్లను చేసుకోవటానికి గానీ ఎవ్వరు ముందుకు రారు. దీంతో ఈ తెగలోని వారికి వివాహాలు కష్టమవుతున్నాయి. అంతేకాదు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది.వీరికి రెండు వేళ్లే ఉండటం వల్ల నడకలో చాలా తేడా ఉంటుంది. సరిగా నడవలేరు. కానీ వీరు చెట్లు ఎక్కటంలో మాత్రం వారికి వారే సాటి అన్నట్లుగా ఉంటారు. చాలా వేగంగా చెట్లు ఎక్కేయగలరు వీరు. దీంతో వీరిలోని లోపాన్నే వారు ఉపాధిగా చేసుకుంటున్నారు. చెట్లు ఉక్కి కాయలు, పండ్లు కోసి వాటితో జీవనం వెళ్లదీస్తుంటారు.