Home » AP
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నానా పాట్లు పడుతున్న ప్రజలకు మరోసారి ఉపద్రవంలా ముంచెత్తింది వర్షం. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయా అన్నట్లుగా ఉంది. రెండూ రూ.100 దాటే ఉన్నాయి ధరల్లో. ఏపీలో టమాట రూ.108 అమ్ముతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్నగోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
మూడు రాజధానుల బిల్లు రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజధాని అంశంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని అన్నారు.
అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో తుఫాను, వర్షాలు, వరదలు నష్టంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ లేఖ రాశారు.
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో 3 వేలకుపైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి.