AP High Court : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలి : ఏపీ హైకోర్టు

అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలి : ఏపీ హైకోర్టు

Ap High Court

Updated On : November 22, 2021 / 5:46 PM IST

Amravati capital petitions : అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం లోపు వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు సంబంధించి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

మూడు రాజధానులపై హైకోర్టులో విచారించిన అనంతరం బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లుగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్.. త్రిసభ్య ధర్మాసనానికి వెల్లడించారు. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం (నవంబర్ 22, 2021)న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడారు.

ఏ పరిస్థితుల్లో మూడు రాజధానులు తీసుకొచ్చామో…ఆర్థిక మంత్రి బుగ్గన వివరించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, తనకు ప్రేమ ఉందన్నారు. ఈ ప్రాంతంలోనే తనకు ఇల్లు ఉందని, రాజధానిలో రోడ్లు డెవలప్ చేయాడానికి డబ్బులు లేవని, అభివృద్ధి చేయాలంటే..ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు చెప్పారు.

Galla Jayadev : ఏపీలో వర్షాలు కల్గించిన నష్టంపై ప్రధాని మోడీ, అమిత్ షాకు గల్లా జయదేవ్ లేఖ

50 వేల ఎకరాలకు రూ. లక్ష కోట్లు అవసరం ఉంటుందని..ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలన్నదే తన తాపత్రయమని, రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ అని..విశాఖలో అన్ని సదుపాయాలున్నాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ వంటి నగరంతో విశాఖ పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు.

విస్తృతమైన.. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.