Home » AP
బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా గూడకొంగ (పెలికాన్) ను అటవీశాఖ అధికారులు ప్రకటించారు.
ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరులో 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు.
పవన్ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎప్పటికీ జగన్‌ను ఓడించలేడన్నారు. పవన్ కనుక... జగన్‌ని మాజీ సీఎంను చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇప్పటికే మంత్రితో సినిమా రంగ దిగ్గజాలు భేటీ అయ్యారు.
ఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గులాబ్ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!