Perni Nani : పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : మంత్రి పేర్ని నాని
ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

Perni Nani
producers meets with Perni Nani : ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రి నవీన్ మచిలీపట్నంలో మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. ఆన్ లైన్ టికెట్ల అమ్మకంతోపాటు సినీ ఇండస్ట్రీలో సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఆన్ లైన్ టిక్కెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ నడుస్తోందని పేర్కొన్నారు.
సినిమా టిక్కెట్లపై నిర్ధిష్ట విధానం ఉండాలన్నారు. నిర్మాతల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సినీ పరిశ్రమ పెద్దలు చాలా మంది తనతో మాట్లాడారని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని గుర్తు చేశారు. ఆడియో ఫంక్షన్ లో వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి మాటలను తామంతా ఏకీభవించడం లేదని చెప్పారు. ఒక వ్యక్తి మాటలను ఇండస్ట్రీ మాటలుగా తీసుకోబోమని తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
Pawan Kalyan : పంచ్ డైలాగులతో చెలరేగిపోయిన పవన్ కళ్యాణ్.. హైలైట్స్ ఇవే!
సినిమా రంగం చాలా సున్నితమైందని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఏదైనా జరిగితే ఇంపాక్ట్ అయ్యేది నిర్మాతలు అని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరిస్తున్నాయని తెలిపారు. రాజకీయం వల్ల సినీ పరిశ్రమ డ్యామేజ్ కాకుండా చూడాలన్నారు. అన్ని థియేటర్లు ఆన్ లైన్ విధానంలో రావాలని చెప్పారు.
సెప్టెంబర్ 20న ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని కోరారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని… త్వరలోనే సీఎం జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మరోసారి టాలీవుడ్ ప్రతినిధులతో సమావేశం అవుతానని చెప్పారు. ఆ మేరకు ఇవాళ మంత్రి పేర్నినాని.. నిర్మాతలతో సమావేశం అయ్యారు.