Pawan Kalyan : పంచ్‌ డైలాగులతో చెలరేగిపోయిన పవన్ కళ్యాణ్.. హైలైట్స్ ఇవే!

నా దేశం నేను రక్షించుకుంటా.. నేను తిట్లు తినటానికి రెడీ.

Pawan Kalyan : పంచ్‌ డైలాగులతో చెలరేగిపోయిన పవన్ కళ్యాణ్.. హైలైట్స్ ఇవే!

Pawan Kalyan

Pawan Kalyan : మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులతో రెచ్చిపోయారు. అవేంటో చూద్దాం.

  1. గ్రామ సింహాలపై కొద్దిరోజులుగా డిక్షనరీల్లో రీసెర్చ్ చేశా. అవి సింహాలో… అడివి సింహాలో కాదు… వీధి కుక్కలు.
  2. జానీ సినిమా పోతే 15లక్షలు అప్పు చేశా
  3. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి నువ్వెవడివి
  4. ఇది కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు…. ఇండియన్ ఎకానమీ… మిశ్రమ ఎకానమీ
  5. అందరికీ భారతి సిమెంట్ ఊరికే పంచొచ్చు కదా
  6. మీరు పిల్లికి బిచ్చం వేయడం చూడలేదు
  7. ఏదైనా ప్రశ్నిస్తే గింజుకుంటారెందుకు
  8. ఇది మీ గడీ కాదు.. సర్వసత్తాక భారతదేశం
  9. రోడ్లు వేయకుండా ఏం పీకుతారు
  10. నన్ను వైజాగ్ లో గెలిపించుకుంటే ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉండేవాణ్ణి
  11. ఓట్లన్నీ వైసీపీకి వేసి నన్ను పనిచేయమంటే ఎలా
  12. దౌర్భాగ్యుల చేత తిట్లు తింటావెందుకు అని వైజాగ్ లో ఫ్రెండ్స్ ఏడ్చారు
  13. నా దేశం నేను రక్షించుకుంటా.. నేను తిట్లు తినటానికి రెడీ.
  14. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా మావ ముఖ్యమంత్రి కాదు. మాకు వారసత్వంగా ఏమీ ఇవ్వలేదు. ఇడుపులపాయ ఎస్టేట్ లాంటివి ఏమీ ఇవ్వలేదు.
  15. చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. నడిచి చూపిస్తాను. మీకిష్టమైతే మీరూ నాతో నడవండి.
  16. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని అడిగితే.. జనసైనికుల మీద వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు. రాజకీయ పార్టీగా బాధ్యత తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రతి సన్నాసితో తిట్టించుకునే అవసరం నాకు లేదు..కానీ.. ఈ నేలపై ప్రేమతో ప్రశ్నిస్తున్నా.. తిట్టించుకున్నా. ఆంధ్రాలో పుట్టా. తెలంగాణలో పెరిగా. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎంత తిడితే అంత బలపడతా. గుర్తు పెట్టుకోండి.’
  17. మర్యాద స్థాయి దిగితే .. ఎలా చేయాలో అలా చేస్తా.
  18. నాకేమైనా థియేటర్లు ఉన్నాయా.. కాకినాడలో థియేటర్లు మీ వైసీపీ వాళ్లవి కావా.
  19. నేను రూ.5వేలు నెలకు పారితోషికం తీసుకున్నా. జానీ సినిమాకు రూ.15లక్షలు అప్పు చేశా.
  20. కష్టార్జితం దోచుకోవడానికి నీకు హక్కు లేదు. ఇది మిశ్రమ వ్యవస్థ. మీ భారతి సిమెంట్ నుంచి ఫ్రీగా పంచొచ్చు కదా. మీ దగ్గర ఉన్న రూ.700కోట్లు పంచండి.
  21. మటన్ షాపుల దగ్గర, పూల కొట్టు దగ్గర, పునుగులు వేసే వాళ్ల దగ్గరా అందరి దగ్గరా దోచేయండి. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా దోచేసుకోండి.
  22. ఏ నాడైనా.. మీరూ మీ అధినాయకుడు డబ్బులు విరాళం ఇచ్చారా.. పిల్లికి బిచ్చం వేశారా
  23. ట్యాక్స్ డబ్బులు ఏం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు అందజేయరు. ఉత్తరాంధ్రలో మాకు తెలిసిన వాళ్లు పెన్షన్ డబ్బులు అడిగితే డబ్బులు లేవని చెప్పారంట.
  24. మా ఇంటి ఆడవాళ్ల జోలికి వచ్చి ఇలా మాట్లాడితే.. ఎలా. మీకు అనిపించదా.. దయచేసి విజ్ఞత పాటించండి.
  25. కోర్టులో ట్యాక్స్ కటి.. సినిమా రంగం నుంచి వచ్చిన వాడ్ని. 2008లో పీఆర్పీ పార్టీలో ఒకటి జరిగింది.
  26. సాధ్యమైనంత వరకూ వెనుక ఉండి నడిపిద్దాం అనుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సభ పెడితే 10లక్షల మంది వచ్చారు. పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోవడం నాకు బాధనిపించింది. అది నాకు గుండెల్లో ఉండిపోయింది.
  27. సత్యాన్ని ఆవిష్కరిద్దాం అనుకున్నా. ఆంధ్రపాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను తిట్టొద్దని చెప్పడానికి వచ్చా.
  28. చాలా పౌరుషం ఉన్నవాడ్ని. పనికిమాలిన వెధవలు, చవటలు, సన్నాసులతో మాటలు పడాలా..
  29. వైసీపీకి వర్గ శత్రువులు కమ్మవారు, టీఆర్ఎస్ కు ఆంధ్రా పాలకులు. నన్ను అడిగారు మీ వర్గ శత్రువులెవరిని. నా వరకూ పేదరికం, అవినీతి, దాష్టీకం ఇవే.
  30. రంగా గారూ తీసుకొచ్చింది కమ్మవారినే. అన్నయ్య సినిమాకు ప్రొడ్యూసర్లు కూడా వారే. ఆయన సభలు పెడుతున్నప్పుడు కృష్ణా తీరం నిండిపోయిందని చాలామంది చెప్పేవారు. అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి రంగా గారికి ప్రాణ భయం ఉందని తెలిసి కూర్చుంటే ఆ రోజు సభలకు వచ్చిన వారు ఏమయ్యారు.
  31. దేహానికి ఒకే రక్తనాళం సరిపోనట్లు.. నదిలాగా. అవసరమున్నప్పుడు వ్యూహం మారుస్తా. మా వాళ్లకు న్యాయం జరుగుద్దా.. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటే కలుస్తా. అమరావతి రాజధానిని ఇక్కడే ఉంచుతారంటేనే బీజేపీలో కలిశా.
  32. తెలంగాణ కావాలంటే అందరూ కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే నాకు ఏమొస్తదయ్యా. మెచ్చి మేక తోలు కప్పుతారా.. మీ కోసమే కేంద్రంతో గొడవపడ్డా.
  33. కనీసం ఒక్కచోటైనా గెలిపిస్తే పని చేసేవాడిని. ఓట్లన్నీ వైసీపికి వేసి నన్ను పనిచేయమంటారేం. అయినా పనిచేస్తా.
  34. రెండు చోట్ల ఓడిపోయినా.. పాపులారిటీ మొత్తం పక్కకుపెట్టేసి మీ ముందుకు వచ్చా. 2009లో జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా.  మీరు నన్ను సీఎంని చేసినా చేయకపోయినా పనిచేస్తూనే ఉంటా.
  35. నా పెట్టుబడి టన్నుల కొద్దీ గుండె ధైర్యం. జీవితంలో సాయుధ పోరాటానికి నడుం బిగించిన వ్యక్తిని నేను.
  36. వైసీపీ వాళ్లు మనలాంటి వాళ్లని చూడలేదు. భయపడతామా మీకు. మీ ఛానెల్ లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడని మీరు.. ఒకరోజున కచ్చితంగా చెప్తారు. అలా చేస్తా.
  37. కశ్మీర్ లో పండిట్లను తరిమేసినట్లు చేస్తే ఎలా. వైసీపీ కమ్మవారిని టార్గెట్ చేస్తే ఎలా.. అలాంటి వారికి మేం అండగా ఉంటాం. మీరు నన్ను కవ్వించారు. నన్ను పిలిచారు. యుద్ధానికి మీరే పిలిచారు.
  38. మిమ్మల్ని ఆంధ్రా రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం వచ్చింది. మీకు సవాల్ విసురుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. కాకినాడలో మీరు పచ్చిబూతులు తిడితే మీమడగలా.. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ మీ ఆగడాలు చూస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యం బద్ధంగానే మిమ్మల్ని లొంగదీసి కింద కూర్చోబెట్టాలో తెలుసు.
  39. వైసీపీ వాళ్లు.. మీకు యుద్ధం ఎలా కావాలో తేల్చుకోండి. కులం ప్రధానం కాదు గుణం ప్రధానం.
  40. అణగారిపోయిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలి. ఇప్పటి వరకూ సామాజిక కార్యకర్తగా పనిచేశా. ఇప్పుడు రాజకీయం మొదలుపెడుతున్నా.