Kodali Nani : చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసిరా.. చూసుకుందాం : పవన్ కు కొడాలి నాని సవాల్

పవన్‌ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ఎప్పటికీ జగన్‌ను ఓడించలేడన్నారు. పవన్‌ కనుక... జగన్‌ని మాజీ సీఎంను చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

Kodali Nani : చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసిరా.. చూసుకుందాం : పవన్ కు కొడాలి నాని సవాల్

Nani

Updated On : September 30, 2021 / 6:56 PM IST

Kodali Nani counter Pawan : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికీ జగన్‌ను ఓడించలేడన్నారు. పవన్‌ కళ్యాణ్‌కు కనుక… జగన్‌ని మాజీ సీఎంను చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. పవన్‌ ముందు ఎమ్మెల్యేగా గెలుస్తాడో, లేదో చూస్కోవాలన్నారు. 2024లో పవన్‌ ఏం చేస్తాడో చూస్తానన్న కొడాలి నాని… చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసిరా.. చూసుకుందామంటూ ఛాలెంజ్‌ చేశారు.

చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని ఘాటుగా కామెంట్‌ చేశారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్‌ చదివి పవన్‌ మమ్మల్ని భయపెడతాడా అని ఎద్దేవా చేశారు. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారని, పవన్‌ ప్రసంగాలకు జనం భయపడతారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి మమ్మల్ని భయపెట్టేదన్నారు. ఆనాడు సోనియాగాంధీకే జగన్‌ భయపడలేదతీ.. నీవెంటి ఆయన్ను భయపెట్టేది అని అన్నారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. వైఎస్సార్‌సీపీతో సమరానికి సై అన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తానంటూ పవన్‌ ఆఫర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు రావొచ్చని పవన్‌ జ్యోతిష్యం చెప్పారు. తన ఆత్మాభిమానంపై దెబ్బ కొడితే గట్టిగా బదులిస్తానని చెప్పారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారతాయన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు మిగులుతాయంటూ జోస్యం చెప్పారు. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు.