Corona Cases : ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు, 8 మంది మృతి
ఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Ap Corona
new corona cases in AP : ఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడి మొత్తం 14,150 మంది మృతి చెందారు.
ఒక్క రోజులో 1,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు 20,22,168 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Pfizer Pill : కరోనాను అడ్డుకునే ఫైజర్ టాబ్లెట్..త్వరలోనే మార్కెట్ లోకి..ఇది ఎలా పని చేస్తుంది?
గత 24 గంటల్లో రాష్ట్రంలో 45,592 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనాతో చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు చొప్పున మరణించారు.
వైఎస్సార్ కడపలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 153, తూర్పు గోదావరిలో 104 పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.