Home » BJP
కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని.. అలాగే, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియ�
ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గురువారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు.
బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
‘‘బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం పట్ల సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. చరిత్రలో ఇదొక కిరాతకమైన కేసు. కానీ ఇలాంటి నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అల�