Beti Bachao: కుమార్తెలను కాపాడాలిని చెప్తూ రేపిస్టులను కాపాడుతున్నారు.. బీజేపీపై రాహుల్ ఫైర్

బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు తాకుతూ వీరికి స్వాగతం పలికారు. ఇది చాలదన్నట్లు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నేత వీరికి సన్మానం చేయడం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది.

Beti Bachao: కుమార్తెలను కాపాడాలిని చెప్తూ రేపిస్టులను కాపాడుతున్నారు.. బీజేపీపై రాహుల్ ఫైర్

says Beti Bachao saves rapists by rahul gandhi

Updated On : August 25, 2022 / 3:46 PM IST

Beti Bachao: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ‘బేటి బచావో.. బేటి పడావో’ నినాదంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులను విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. కుమార్తెలను కాపాడాలని చెప్తూ రేపిస్టులను కాపాడుతున్నారని దుయ్యబట్టారు. గురువారం ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ దేశంలో మహిళల్ని, బాలికల్ని కాపాడేంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే బిల్కిస్ బానోకు న్యాయం చేయండని డిమాండ్ చేశారు.

‘‘బీటీ బచావో (కుమార్తెను కాపాడండి) అని పెద్ద నినాదాలు చేసేవారే అత్యాచారం చేసేవాళ్లని కాపాడుతున్నారు. ఈరోజు మన ముందున్ సవాల్ ఏంటంటే.. దేశంలో మహిళల్ని, వారి హక్కుల్ని కాపాడటం. ప్రభుత్వానికి నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే బిల్కిస్ బానోకు న్యాయం చేయండి’’ అని రాహుల్ గాంధీ హీందీలో ట్వీట్ చేశారు.

బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు తాకుతూ వీరికి స్వాగతం పలికారు. ఇది చాలదన్నట్లు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నేత వీరికి సన్మానం చేయడం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది.

Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడమే కారణమా?