Home » Gotabaya Rajapaksa
ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని స్పీకర్ యాపా అబేవర్దన చెప్పారు. గొటబాట రాజపక్స విదేశంలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో యాపా అబేవర్దన చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చడం గమనార్హం.
శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయ రాజపక్సే సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 13న అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని ప్రధాని రణిల్ విక్రమసింఘేకు గొటబయ తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
అధ్యక్ష భవనంలోకి వెళ్లిన ఆందోళన కారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూంలో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా�
అధ్యక్ష భవనం ముట్టడికి వేలాది మంది ఆందోళనకారులు తరలిరావడంతో పాటు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సూచనలతో గొటబయ అధ్యక్ష భవనంలోని బంకర్ గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ భవనంలో అత్యంత భద్రతా బంకర్ ను కనుగొన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విదేశాలకు పారిపోయాడని ఆ దేశ మీడియా పేర్కొంటుంది. ఒకవేళ గొటబాయ విదేశాలకు పారిపోతే.. తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? రాజీనామాకు గొటబాయ నిరాకరిస్తే ఏం చేయాలని.. అనే అంశాలు ప్రతిఒక్కరి మెదళ్లను తొలుస
ఆర్థిక సంక్షోభంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులు నిన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి దూసుళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ
శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు.