Sri Lanka: గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారు: మాటమార్చిన శ్రీలంక స్పీకర్
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని స్పీకర్ యాపా అబేవర్దన చెప్పారు. గొటబాట రాజపక్స విదేశంలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో యాపా అబేవర్దన చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చడం గమనార్హం.

Gotabaya And Speaker
Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని స్పీకర్ యాపా అబేవర్దన చెప్పారు. గొటబాట రాజపక్స విదేశంలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో యాపా అబేవర్దన చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చడం గమనార్హం. తాను బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరపాటున అలా చెప్పారని అన్నారు. గొటబాయ రాజపక్స నివాసాన్ని వేలాది మంది ఆందోళనకారులు చుట్టుముట్టడంతో ఆయన అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడో ఉన్నారో ఇప్పటికీ తెలియరాలేదు.
AIADMK: ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం తొలగింపు.. చెన్నైలో 144 సెక్షన్
ఆందోళనకారుల డిమాండ్ మేరకు తాను ఈ నెల 13న రాజీనామా చేస్తానని గొటబాయ రాజపక్స ప్రకటించారు. గొటబాట విదేశాల్లో ఉన్నారని, ఆయన ఈ నెల 13న శ్రీలంకకు వస్తారని తాజాగా యాపా అబేవర్దన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఆయన మళ్ళీ స్పందిస్తూ యూ-టర్న్ తీసుకున్నారు. ఎన్నడూలేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న నేపథ్యంలో శ్రీలంకలో పదే పదే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.