Home » Government
హైదరాబాద్ లో వీఆర్ఏలు కదం తొక్కారు. వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బాట పట్టారు. వేలాది మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా 6 వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇంతమంది వీ�
బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.
అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద�
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
వాట్సాప్లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.
యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపడతారు. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కార్యక్రమం కాదు. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందనే మేము భావిస్తున్నాం.
గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
స్థిర, చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అధికారులకు ముందుగానే తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ జీవోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమైంది. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి జీవో ఇచ్చారని విమర్శలు వచ్చాయి.
వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.