Home » happy new year 2023
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బేగంపేట్, లంగర్ హౌస్ ప్లైఓవర్ మినహా నగరంలోని మిగతా ప్లై ఓవర్లన్నీ మూసిఉంచుతారు. శనివారం రాత్రి 10గంటల నుంచి 1వ తేదీ తెల్లవారు జామున 2గంటల వరకు నగరంలోకి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ �
ప్రపంచ దేశాల్లో ఆయా సమయాలను బట్టి న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. కొన్ని దేశాల్లో 2023 సంవత్సరం ముందుగానే వస్తుంది. భారత్ కాలమానం ప్రకారంతో పోల్చితే.. భారత్లో కంటే కొన్నిగంటల ముందే పలు దేశాల్లో ప్రజలు 2023 సంవత్సరంలోకి అడుగు పెడతారు.
హైదరాబాద్ లో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి.
డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్లు నడపనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి రైలు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమై చివరి స్టేషన్ కు 2గంటలకు చేరుకుంటుందని తెల�
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది.
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం(డిసెంబర్18,2022) ఉత్తర్వులు జారీ చేశారు.