MMTS-Metro Train : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. నేడు అర్ధరాత్రి 2 గంటల వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైలు సేవలు

హైదరాబాద్ లో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి.

MMTS-Metro Train : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. నేడు అర్ధరాత్రి 2 గంటల వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైలు సేవలు

MMTS and Metro train

Updated On : December 31, 2022 / 10:27 AM IST

MMTS-Metro Train : హైదరాబాద్ లో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ -లింగంపల్లి, ఫలక్ నామా-లింగంపల్లి లోకల్ ట్రెయిన్స్ అర్ధరాత్రి దాటాక కూడా తిరుగనున్నాయి.

ఇటు మెట్రో సర్వీస్ వేళలను కూడా హైదరాబాద్ మెట్రో రైలు పొడిగించింది. జనవరి 1 తెల్లవారుజాము 2 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. చివరి గమ్యస్థానాలను 2 గంటలకు చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి తెలిపారు.

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

మెట్రో స్టేషన్లు, రైళ్లలో మెట్రో రైలు సెక్యూరిటీ పటిష్ట నిఘా ఉంచనుంది. మద్యం తాగి దుర్భాషలాడకుండా, ఇతర ప్రయాణికులను ఇబ్బందులు లేకుండా నియంత్రించనున్నారు. సురక్షిత ప్రయాణానికి ప్యాసింజర్లు అధికారులంతా సహకరించాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.