Hyderabad Police Tough Decision : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే.. రూ.15 వేలు జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

Hyderabad Police Tough Decision : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే.. రూ.15 వేలు జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష

Hyderabad police

Hyderabad Police Tough Decision : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డ్రండెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లైతే తొలిసారి రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధించనున్నట్లు వెల్లడించారు.

మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్ కు రవాణా శాఖ పంపుతామని పేర్కొన్నారు. తొలిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.

MMTS-Metro Train : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. నేడు అర్ధరాత్రి 2 గంటల వరకు ఎంఎంటీఎస్, మెట్రో రైలు సేవలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో శనివారం రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల
పరిధిలో రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.
అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

అలాగే రాత్రి 10 గంటల తర్వాత సిటీలోని లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలపై నిషేధం విధించారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్ ప్రెస్ వే పైనుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.