New Year Celebrations : నూతన సంవత్సర వేడుకలకు కొత్త రూల్స్.. డ్రగ్స్, ఆయుధాలు నిషేధం

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం(డిసెంబర్18,2022) ఉత్తర్వులు జారీ చేశారు.

New Year Celebrations : నూతన సంవత్సర వేడుకలకు కొత్త రూల్స్.. డ్రగ్స్, ఆయుధాలు నిషేధం

Police new rules

Updated On : December 31, 2022 / 10:26 AM IST

New Year celebrations : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం(డిసెంబర్18,2022) ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే వేడుకలు నిర్వహించే 3 స్టార్, ఆ పై స్థాయి హోటల్స్, క్లబ్స్, పబ్స్ తప్పనిసరిగా 10 రోజుల ముందు అనుమతి తీసుకోవాలని తెలిపారు.

బయట తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆయుధాలు, డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. డీజే, మ్యూజిక్ సిస్టంలతోపాటు పటాకుల శబ్ధాలు 45 డిసెబుల్స్ కు మించవద్దని తేల్చి చెప్పారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం తర్వాత మద్యం సరఫరా చేయకూడదని పేర్కొన్నారు.

Drunken Drive: హైదరాబాద్‌లో ఒక్కరాత్రే 3146కేసులు నమోదు

నియమ, నిబంధనలకు సంబంధించిన డిస్ ప్లేలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. కొత్త సంవత్సరం రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా లేదా దీర్ఘకాలికంగా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.