Home » Highest Rainfall
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 70కి పైగా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 20కి పైగా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి.
సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఒకప్పుడు వర్షాల కోసం ఆతృతుగా ఎదురుచూసే తెలంగాణలో.. ఈ ఏడాది కుండపోత వర్షం కురిసింది. వర్షాలు పడాలని దేవుళ్లకు ప్రార్థనలు చేసే స్థాయి నుంచి పడ్డ వానలు ఇక చాలు అనే స్థాయికి చేరుకుంది.
రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. అల్వాల్ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవధిలో 106 మి.మీటర్ల వర్షం పడింది. బేగంపేట విమానాశ్రయం వద్ద 2013 అక్టబర్ 10న 98.3 మి.మీటర్ల వర్�