Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. 10 సెం.మీ. వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి.

Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. 10 సెం.మీ. వర్షపాతం నమోదు

heavy rain in hyderabad

Updated On : October 13, 2022 / 11:30 AM IST

Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌ జోన్లలో భారీ వర్షం కురిసింది.

అత్యధికంగా కూకట్‌పల్లిలో 10.4 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, కుత్బుల్లాపూర్‌లో 9.2 సెం.మీ, తిరుమలగిరిలో 9 సెం.మీ., రామచంద్రాపురం 8.2 సెం.మీ., మూసాపేట్‌ 8 సెం.మీ., ఫతేనగర్‌లో 7.3 సెం.మీ., పటాన్‌చెరు 7.2 సెం.మీ., బాలానగర్‌ 6.8 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయింది.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బొరబండలోని కాలనీల్లో వరద పోటెత్తింది. ఇళ్ల ముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌ కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రెండు వైపుల పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఖైరతాబాద్, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సనత్‌గర్, ఎస్ఆర్‌నగర్, వెస్ట్‌ వెంకటాపురం, రామచంద్రాపురం రోడ్లపై భారీగా వరద ప్రవహించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్లిపోయేట్లు చర్యలు తీసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.